ఉనికి
కదిలే కాలానికి ఎదురు నిలవగలగడం ఎవ్వరికి సాద్యం కాదు
కరిగే మబ్బుల యదలో నిండిన ఆర్ద్రాన్ని వాన రాకుండా ఆపడం ఎవ్వరి తరం కాదు
అల కడలి లో ఉవ్వెత్తున ఎగసే కెరటాన్ని ఆప గలగటం వృధా ప్రయాస
నీ జ్ఞాపకాలతో నిన్నటి దాక రాసిన ప్రేమ కావ్యాలకింక విలువ లేదు
వెలకట్టలేని జీవితానికి చిరునామా స్నేహ బంధమే
వలసలు లేని భేదాభిప్రాయాలు లేని ఆప్యాయత బంధమే శాస్వతం
మనిషి ఉనికి కేవలం బ్రతికున్నంత వరకే స్నేహం విలువ అజరామరం
ఈ కవిత తో నా "కావ్యాంజలి" బ్లాగ్ కవిత విభాగం లోని 300 టపాలు పూర్తవ్వుతాయి.
ఇక నుండి బంధాలు బాంధవ్యాలు ప్రకృతి అందాలు స్నేహ మాధుర్యాలు పంచె కవితలతో మీ మనసు దోచే ప్రయత్నం చేస్తానని మనవి చేసుకుంటున్నాను