ఏవో ఊసూలు
మొదటి రెండు పేజీలు రాస్తున్నప్పుడు అనిపించింది మహత్తర కార్యం తలపెట్టానని
మనసులో ఏదో తెలియని పరవశం ఎగబాకింది
కాని
ఏమయ్యిందో ఏమో నాకే తెలియని ఆనందం నీ ఆలోచనలు మొదలవ్వగానే
ఎమారుపాటుగా ఎటో రాసుకేల్లింది .. కొన్ని నిజాలు కొన్ని అసంకల్పితాలు
రాస్తూ రాస్తూ నువ్వు గుర్తుకోచ్చావ్ నా లోకమే మారిపోయిందనుకున్నాను
లేదు
నా లోకం ఇలాగే ఉంది వన్నె తరగని భావం లా తామరాకు పై టెలి నీటి బొట్టులా
నువ్వే మారిపోయావు నీ ప్రేమ మారిపోయింది.. ఇవన్ని తలుచుకుంటుంటే
ధారాపాతంగా కన్నీళ్ళు వస్తున్నాయి. కన్నీళ్ళు తెప్పించేవి జ్ఞాపకాలు కాని నువ్వు చేసినవి మాన్పలేని గాయాలు వెన్నెల అందాలు నాకు కనిపిస్తే నీకు గాడాంధకారం కనిపించింది
ఇలాంటి మాన్పలేని గాయాని పట్టుకుని రాయాలనుకున్న ఆ జీవిత పుస్తకం పేజీలు నిండా కన్నీళ్ళతో తడిసి మోపెడయ్యింది. ఇలా నువ్వు రేపిన గాయాన్ని తలుచుకుని బాద పడే కంటే అవన్నీ మరిచిపోయి హాయిగా ఉండటమే మంచిదనిపించి ఇలా నన్ను మభ్య పెట్టిన నీ జ్ఞాపకాలను నా అంతరంగం నుండి వెలి వేసి ఆ కాగితపు మోపుని కుప్పతోట్టిలో పదవేసాను
ఇప్పుడు
హాయిగుంది మనసులో తేలికగా ఉంది తన్మయత్వం నిండి నన్ను నాలో నేనే కొత్తగా చూస్తున్నట్టు ఉంది
వెన్నెల అందాలను ఇన్నాళ్ళు నీ జ్ఞాపకాల చీకటిలో చూడలేదు చూసిన నాకు మసకగా కనిపించేది
మాటలు అర్ధం కాక మనసు మూగబోయి మాట రాక మునం దాల్చిన రోజులు ఇక నన్ను వెంటాడి వేధించవు
కలతలు రేగి నీ ఊహల్లో నిద్రలు లేక అలమటించిన రోజులు ఇక నా జీవితం లో శున్యమే అని చెప్పగలను
ఔను
నేడు నేను నన్నే ఓ కొత్త ప్రపంచానికి ఆహ్వానం పలుకుతున్నట్టు ఉంది
ఇవాళ్ళ నిజంగా మనసు మనసునిండా ఆనందం తో ఉరకలు వేస్తూ ఉంది