చరమగీతం

​చకోరిపక్షి లా నా వెంటే ఎగరడం నీకానందం
చాతకపక్షి లా గగనానికి రివ్వున ఎగిరిపోదాం రమ్మంటావు 
నీ ఎదుటే నిలుచున్నా గూడ్లగుబ్బ కళ్ళు పెట్టుకు కనబడుట లేదని సరసం ఆడాను అంటావు
 
కాని చెలియా నీ మీద నాకున్న ఆ ప్రేమ సమసిపోవడానికి నాకు ఇంకొంచం సమయం కావాలి
నాది కాని నీ హృదయాన్ని నికప్పగించాలని ఎన్నో విధాలుగా కోరుకుంటున్న 
వెన్నెల అందాలు కూడా ఆస్వాదించలేని నన్ను ఈ రోజు నీ ప్రేమ అనే ద్వేషం నుండి విముక్తిని చెయ్య సంకల్పించాను 
నాది కాని నీ మనసుని నీకే వెనక్కి ఇచ్చే క్రమం లో ఒక్కో జ్ఞాపకానికి తిలోదకం పాడాలనుకుంటున్నాను
నా గుండె కు గాయం చేసిన ఆ క్షణాలకు చరమగీతం నీ మతిలేని ప్రేమపు హాలాహలాన్ని దిగమింగి అజేయుడవ్వాలని ఉన్నది

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం