కావ్యాంజలి ప్రస్థానానికి ఆరేళ్ళు పూర్తి

వెన్నెల ఎప్పటి మాదిరిగానే కురుస్తూ ఉన్నా, ఈరోజెందుకో కొంగోత్తగా కనిపిస్తుంది
జాబిలీ కిరణాలు తాకి కలువ భామ ఎప్పటిలానే విరబుస్తూ ఉన్న నేడేందుకో కొంగోత్తగా కనిపిస్తుంది
లోకమే మారి పోయిందా లేకా నా మనసు ఈ లోకాన్ని కొత్తగా చూస్తున్నట్టుంది

ఏమో మరి పదాల విన్యాసం లో కవితల సుమబాలలై
ఈ ప్రకృతి పూదోటలో అక్షరాల సుమార్చన నేటికి ఇంతింతై
నిన్నటి ఆ దూరాన్ని నేడు దగ్గర చేసిందేమో భావగీతికలై

అలరారుతున్న పదాల వలయాలలో చిక్కుకుని
భావాలు వాటంతటవే ఉలికి పడిపోయాయా మరి ఏమో
మనిషికి ఆరోప్రాణం ఉన్నట్టు మనసుకు కూడా ఆరోప్రాణం అయ్యి ఉన్నవేమో
కవితల సరళి ని చూస్తూ తబ్బిబ్బవుతుంది మనసు అందుకేనేమోనని

(ఆరేళ్ళ క్రితం అనగా 30-11-2007 న నా కవితలకు ఈ బ్లాగ్ ద్వారా అందరికి పరిచయం అవ్వాలని చేసిన చిరుప్రయత్నానికి నేటితో ఆరో ఏట నుండి ఏడో ఏటలోకి అడుగిడుతున్న శుభతరుణాన రాసిన కావ్యం ఇది ) 

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల