Posts

ఏదో రాయాలనిపించి...

Image
ఇమేజ్ కర్టసీ: వర్త్ 1000. కామ్ ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  మనసు ఆనంద డోలికలు ఊగుతూ ఉంటె  తనతో పాటు ఏదో అందాల లోకం లో విహరింపజేస్తుంటే  అక్షరాలన్నీ భావాల సుడిగుండంలో చిక్కి చెల్లాచెదురైపొయాయి  ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  ఏవో తియ్యని జ్ఞాపకాలు కళ్ళముందు కదులుతుంటే  ఆ తెరచాటు భావాలేవో బయిటికి ఉబికివస్తుంటే  అక్షరాల్లని ఆ ఊబిలో చిక్కుకుని సుడులు తిరిగి కనుమరుగయ్యాయి ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  ఎన్నోరోజులుగా అనుకుంటున్నా ఆ ఆత్మీయ స్పర్శ ఏదో నన్ను తాకింది  ఎవరని వెనక తిరిగి చూసా భయం తో, అక్కడ ఎవరు లేరు నా నీడ తప్ప  ఆ నీడలో నా నిన్నని చూసి బాధతో  నీరుగారి ఎండిపోయాయి ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  మదిలో భావాలను ఎకరూపు పెట్టాను  తన పంతం నేగ్గించుకుని ఠీవిగా నిటారుగా నిలబడిన ప్రేమ నన్ను అర్హత అడిగింది  ఇన్నేళ్ళు నిన్ను నేను నా మదిలోనే దాచిన సంగతి చెప్పాను మనసుని అర్ధం చేసుకోలేని ఫీలింగ్ ను నీకు పరిచయం చేసింది నేనేనా అని తలవాల్చి అదృశ్యమయింది  ఏదో రాయాలనిపించి ఇలా వచ్చాను  భావా...

వీటికి సమాధానం నీకే తెలియాలి

అందరికి అంది అందకుండే ఓ ప్రేమ నీకు కొన్ని ప్రశ్నలమ్మ! ఒంటరి జీవితం లో తుంటరి తలపులు తెప్పిస్తావు ఎందుకమ్మ? తీరా కలసినాక మొగమాటం బిడియం అంటూ సాకులు ఎందుకమ్మ? ఏకాకిగా ఎవరిని ఉండనీవు కాదమ్మా మరి నీకా శక్తి ఇచ్చింది ఎవరమ్మ? రెప్పల కంటిపాపకు కాంతినే కాదు మనసు అద్దం లో భావాలు చూడడం నేర్పింది నీవేకదమ్మ? మనసులో ఎప్పుడు వచ్చి చేరిపోతావో అది మాత్రం ఎవరికీ తెలుసమ్మ? నువ్వు ఉన్నవని కనిపెట్టే లోపలే కనుమరుగై పోతావు ఇదేమి చిత్రమమ్మ ? మనషులు పలికే భాసలో అలకలు కులుకులు తెప్పిస్తావు ఏలనమ్మ ? అన్ని తెలిసి ఇట్లా వేధించడం అది నీకే తగును ఎలా ఓయమ్మ? నువ్వు చేరిన క్షణం నుండి నీపైనే ధ్యాస ఎందుకో తెలిదమ్మ ? ఇలా నన్ను నీలో నిన్ను నాలో చూసుకోవడమే ప్రేమెనేటమ్మ ? మారు మాటలాడక సమాధానాలు చెప్పవే ఓ ప్రేమ అలక నీకు తగదు గాక తగదు !!  

కాలం మారింది

కమ్మని కల ఏదో కనులను మెలకువలోకి తీసుకొస్తుంది తీర కళ్ళు తెరిచాక ఏముంది ఆనందమంతా ఎగిరి పోతుంది  పువ్వులను చూస్తె మనసు ఉప్పొంగి పోతోంది  వన్నె తరగని అందానికి క్షణకాలమే పాశం అవ్వి మరో క్షణం లో వాడి పోతుంది  మనసులో నిన్ను తలచిన వెంటనే ఎగిరి గెంతాలనిపిస్తుంది నిరుడు నన్ను వెంటాడిన ఆ నీడని తరమాలనిపిస్తుంది  తేరిపార పరికించి చూస్తె నువ్వు లేవు నీ ప్రేమ  లేదు భూమి కృంగి పోతుందన్న ఫీలింగ్ ఒకటి  మనసు నిన్ను మరిచిపోవాలని పాటలు వింటూ ఉంటె  "ప్రేమ ఎంత మధురం .. అని అభినందన నుండి ఓ రాగం  కరిగే దాక ఈ క్షణం గడిపేయాలి .. అని ఆర్య నుండి   నమ్మక తప్పని నిజమైన.. అని బొమ్మరిల్లు నుండి " ఇలా ఒకటి వెనకాల ఒకటి ఏడుపు గీతాలే ... విరహ గీతాలే కాని ఏదో తెలియని ఆర్ద్రత నిండిన మనసు తేలిక పడ్డట్టు అనిపిస్తుంది  ఏమో ఇది ..  నీతో ప్రేమలో ఉన్నపుడు అన్ని హుషారు గొలిపిన పాటలే  "ఎల్లువచ్చి గొదారమ్మ.. నుండి నిన్నటి  మై హార్ట్ ఇస్ బీటింగ్ .. నుండి నేటి నిన్ను చూడగానే ..." వరకు  ఇప్పుడెక్కడ ఉన్నాయవి నీతో పా...

నీకోసమని తిరిగి వస్తాను

నీ కోసమని వేచి ఉన్న కన్నుల్లో కలలు కరిగి కన్నీరుగా మారి నిను చేర పయనం అయ్యాయి ఏలా నీకి అభియోగం బాల, విననంటివా నా గోల  చీకటిని చీల్చి సూర్యోదయం అయినట్టు, ఏదో ఒకరోజు నీకోసమని తిరిగి వస్తాను, నీ గాయపడ్డ మనసును అర్ధం చేసుకోవడానికైనా  ఏదో ఒక రోజు నీకోసమని వస్తాను.  ఎన్నడు నీపై నా ప్రేమను నిత్యనూతనంగా ఉంచుతానని మనవి చేస్తూ

तस्वीर

छोड़ कर गए नहीं हम कहीं देखना था प्यार कितना है बस अब देख लिया अब रहा नहीं गया दौड़ के आगये हम देखो वापस उस प्यार के वास्ते किनारा था पास में लेकिन नाव निकल पड़ी कहे बिन हम जाते तो कहाँ तुम्हारी ही यादों में खोये खोये से हर बार एक ही बात तुम्हारी मेरे कानों में गूँज उठती "मुझे छोड़ कर ना जाना ओ हमसफ़र, एक न एक दिन जरूर आया करोगे मेरे यहाँ" आज वो बात सच निकली और लो मैं चला आया वापस तेरे पास तेरे प्यार की ही नाव में सोचता था यूंही कैसे गुजरे मेरे दिन तेरे बिन सूरज उठता था चाँद ढलता था बस कटा एक दिन आज तक किसीने तुम्हारी तरह मुझे घेरा नहीं तेरे प्यार की कोई जादू जो तुमने चला दी ढूँढता हुआ निकल पडा हूँ तेरे लिए तस्वीर एक मन के भीतर 

Terrafugia TF-X

Image
TERRAFUGIA TF-X We have seen many terrestrial vehicles that have played a pivotal role in transporting us from one place to another place. Our dreams to fly got fulfilled with the Invention of Airplanes, but even then there was a void in the transport segment. Given the limitations of a terrestrial vehicle to cover large distances with precision and safety was not answered until 2009, when a team of graduates from Massachusetts Institute of Technology invented a new technology in the personal transportation sector. And that very invention called up a standing ovation. It was a transformable/convertible plane-car that can be owned, given that you pass the Test Pilot Licensing Examination. The first Ave-Car was the Transition. The TF-X can fit in a regular car shed/garage Given to the complex systems inside the Transition, a new Hybrid Ave-Car known as TERRAFUGIA TF-X has been developed. The whole vehicle is Electric powered...

రక్షాబంధనం

Image
అన్న చెల్లెళ్ళ అనురాగానికి ప్రతీకగా  అనునిత్యం ఒకరికి ఒకరు ఆలంబనగా  దేవుడిచ్చిన ఓ కమ్మని వరం నీవమ్మ  ఈ రక్షా బంధం మన బంధాన్ని ఇంకా గట్టిపరచాలని  నీ ఆశలు ఆశయాలన్ని నెరవేరాలని ఓ అన్నగా దీవిస్తూ  ఈ రాఖి పండగ నాడు ప్రతి అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు సుఖసంతోషాలతో మెలగాలని అందరి ఇంట సిరులు పండాలని కోరుకుంటూ  ఓ కృష్ణునికి సుభద్ర లా, మన మధ్య ఈ వాత్సల్యాలు ఎన్నటికి చెరిగిపోదని ఆసిస్తూ ఆశీర్వదిస్తూ  మీ అందరి మేలు కోరే అన్నగా కోరుకుంటూ రక్షాబంధన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను మీ ఆదరాభిమానాలను ఓ సూత్రంగా మలచి మణికట్టుకు కట్టే ప్రతి చెల్లి కంట ఆనందాన్ని అవుతానని కోరుతూ