Posts

ఆవేదన

Image
Image Courtesy: stockvault.net అంతుచిక్కని ఆకాశం అని తెలిసిన రెక్కలు చాచి అందుకోవాలనుకుని బొక్క బోర్ల బడ్డాను అనంతమైన భావాలు మదిలో ఏవో రేగి, ఏ భావం ఎక్కడ మొదలైందో తెలియని తికమకలో మునకెసాను అందని చిరుగాలి అని తెలిసిన వినిపించి కనిపించని అందెరవం విని వెఱ్రి పరుగులు తీశాను నెలకెసిన బంతిని గట్టిగ విసిరితే నా మోముపైనే గాయం చేసింది, చాల దూరం అని తెలిసిన కోరాను తెలియని తీరం వెంబడి నాలుగు నెలల రెండు వారాల ఓ రోజు తనవెంట తన పలుకులని చూస్తూ గడిపాను ఇన్నాళ్ళకు తేరుకుని నన్ను నేను చూసుకుంటే: మానని గాయం అని భ్రమించిన ఆ గాయాలు ఏనాడో మాయమైపోయాయి భారం అని ఇన్నేళ్ళు గుండె బరువెక్కి ఉన్న ఏనాడో తెలికపడిపోయాయి  తన జ్ఞాపకాల దొంతర ను చీల్చుకుని కావ్యమై మీ ఎదుట అక్షరం అయ్యి నిలుచున్నాయి  

అసలు సిసలు మనిషి

కనురెప్పలకు కనుపాపను కాపాడమని ఎవ్వరు చెప్పరు దెబ్బతగిలితే మానిపోమని గాయానికి ఎవరు చెప్పరు దుఃఖం కలిగితే కన్నీరు రావాలని కంటిపాపకు ఎవరు చెప్పరు బాధలో ఉన్నప్పుడు సాంత్వన ఇవ్వాలని ఎవరు చెప్పరు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే తుడిచే చెయ్యి, ఏడుపోస్తే తలవాల్చె భుజం ఎప్పటికైనా ఉండాలి మనిషిని ప్రకృతి లోని జంతువుల కన్నా వేరే అన్నప్పుడు మనిషి మృగం లా మారకూడదు నవసమాజ స్థాపనలో ఓ మైలురాయి అయ్యి నిలవాలి కష్టం కలిగితే ఓదార్చే మనసు కలిగుండాలి మన జీవితం ఎన్నినాళ్లో తెలియని సందిగ్దం ఉన్నపుడు చెడు చేసి జనం ముందు జీవచ్చవం కాకూడదు మనసునేరిగి నిరాడంబరత కలిగి భయభక్తి కలవాడే మనిషి పగిలే గుండె ఏనాటికి అతకదు, అది తెలిసి గాయపరచడం ప్రేమే కాదు ముసుగులో మంచిని నటించి చెడు చేసి నవ్వుకునే వాళ్లకు ఇవేమీ అర్ధం కాదు రెప్ప మూస్తే జననం రెప్ప ముస్తే మరణం ఇది తెలిసి మసులుకున్నవాడే అసలు సిసలు మనిషి 

बीती बातें

कल की बीती बातों को शायद मैं दोहराना चाहा  उस टूटी शीशे में हर बार उसका चेहरा देखना चाहा  उसकी जब कभी याद आती है तो दिलभर रोना चाहा  इंतहा अब हो गयी पर भी उसकी यादगार पलों में जीना चाहा  पर ज़िन्दगी इस क्षण में रुख जाती नहीं  जो दिल के करीब न आ पाये उसकी छवि दिल से जाती नहीं  लेकिन ज़िंदा दिल में बस येही ख्वाइश नहीं रहे, हमें भी कभी हार मान रुख जाना नहीं  जो हमारे नसीब में होते हैं किसी न किसी एक दिन हमारे सामने आ ही जाते हैं, चिंता कभी करना नहीं  हरेक मनुष्य की सोच में बदलाव होते हैं कोई लोग दिल के कच्चे होते हैं  इरादों में जीकर जीवन बना लेते हैं  ये कोई रुकावट नहीं, ये कोई हार नहीं, बस ज़िंदगानी की एक छोटी सी सबक हैं  भटकता हुआ राही को अपनी मंजिल तक जाना चाहिए, चाहे पेड़ कि छाँव उसे पल भर के लिए रोख देती है  

ప్రేమను ప్రేమగా

ప్రేమను ప్రేమగా ప్రేమిస్తే నాకు ద్వేషం మిగిల్చింది ఇక ఏమని ప్రేమించను, ఎవరిని ప్రెమించను నా ప్రేమను వేర్రిదంటుంటే రాగద్వేషాల క్రీనీడల మాటున ప్రాణమున్న కీలుబోమ్మనై ఆడి పాడాను ఇక ఏమని నర్తించను, నా చిందులని పిచ్చి గెంతులంటుంటే నా మదిలో భావాలు తాపానికి మసిబారి మసకబారకుండా పదిలంగా అంతర్జాలమనే అందలాన్ని ఎక్కించి ఊపిరి పీల్చుకుంటుంటే మదిలో మెదిలే భావాలు అక్షరాల్లో ఇమడలేక మనసులో నిలువలేక ఊపిరి సలపనీక ఉక్కిరిబిక్కిరి చేస్తూ కలత నిదురను మిగులుస్తుంటే కానరాని దూరాలకు కలవని తీరాలకు సంద్రం ఒడ్డులకు సెలయేటి వాగులకు నిర్బంధం చేసి ప్రేమే ద్వేషమో ద్వేషమే ప్రేమో ఆప్యాయతే అనురాగమో తెలియక సతమతమౌతుంటే This is not a Pessimistic Poetry, This is one of its kind.. :)

మనసుకు తెలిసిన ఆగంతకుడు

అతివ ఆలోచనలు  అర్ధం చేసుకోవడానికి అతడికి చాల సమయం పడుతుంది మగువ మనసుని అర్ధం చేసుకోవడానికి మగాడికి చాల సహనం కుడగట్టాల్సి వస్తుంది అమ్మాయి చిరునవ్వు వెనక దాగే  భావాల కన్నా ఆ భావాన్ని వెతకడంలోనే సమయం పడుతుంది కరిగే మబ్బైన వెంటనే చినుకై హరివిల్లులతొ జోరు  వానై మేనుని తడుపుతుంది కాని అమ్మాయి కన్నీటి చుక్క ఎందుకు వస్తుందో అంతుచిక్కనిది ఆప్యాయత నిండిన కన్నుల్లో దయాగుణం కలిగిన మనషులకు అహం అనే మచ్చ మిగిల్చే పరిణామమిది ఓ కొడుకుగా అన్నగా తమ్ముడిగా భర్తగా తండ్రిగా తాతగా ఇలా ఒక్క రూపానికి ఇన్ని పేర్లు ఉన్నప్పుడు సాటి మానవత్వ గుణం ఎందుకు రోజురోజుకి దిగాజారిపోతోంది, మానవత్వ విలువలు ఎందుకు తరిగిపోతుంది ఆలోచనలే కాదు ఆచరించడం కూడా మనిషి నేర్చుకున్ననాడే తన అస్తిత్వానికి తన ఉనికిని చాటుకునే శక్తి ఉంటుంది పుట్టేటప్పుడు అందరు ఒకలానే పుడుతారు చిన్నారుల్ల పరిస్థితులే మనిషిని పతనం వైపునకొ ఉత్థానం వైపునకొ కదిలిస్తుంది వేసే ప్రతి అడుగు కాలచక్రం లో మిళితమై సమ్మిళితమై ఉన్నప్పుడు ఆ అడుగు జాడల్లో మంచి అనేది అలవర్చుకుంటే ఆ జన్మ సార్థకత ఆ పుట్టుక చరితార్థం 

Ormie The Pig

Image
Meet Mr. Ormie The Pig, Who wants to have the Cookies that are placed above a 2-door Refrigerator. Laugh your hearts Out after watching this video that shows how Mr. Ormie tries his luck to have those sweet smelling cookies for himself. This is added just for fun.. This particular Movie was made in Canada, as a Children film and has got accolades for pure entertainment. Seeing this video reminds one of Tom and Jerry. Video Courtesy: Youtube

ఆలోచనలు

కొత్తగా ఏమి రాయాలో పాలుపోక జరిగిన వాటి జోలికి వెళ్ళలేక జరుగుతూన్న వాటిని  మరువలేక నవ్వలేక ఏడవలేక కన్నుల్లో నిదుర జాడలు కానరాక భావగీతాలు  మదిని దాటి వెళ్ళలేక హృదయపు అంచులలో బంది అయ్యి కరిగిపోని కల అయ్యి కన్నుల ఎదుట ప్రత్యక్షమయ్యి అక్షరాలలో భావాన్ని నిగుడితం చేసిన సుమమాలికలై