ప్రేమను ప్రేమగా

ప్రేమను ప్రేమగా ప్రేమిస్తే నాకు ద్వేషం మిగిల్చింది
ఇక ఏమని ప్రేమించను, ఎవరిని ప్రెమించను నా ప్రేమను వేర్రిదంటుంటే

రాగద్వేషాల క్రీనీడల మాటున ప్రాణమున్న కీలుబోమ్మనై ఆడి పాడాను
ఇక ఏమని నర్తించను, నా చిందులని పిచ్చి గెంతులంటుంటే

నా మదిలో భావాలు తాపానికి మసిబారి మసకబారకుండా
పదిలంగా అంతర్జాలమనే అందలాన్ని ఎక్కించి ఊపిరి పీల్చుకుంటుంటే

మదిలో మెదిలే భావాలు అక్షరాల్లో ఇమడలేక మనసులో నిలువలేక
ఊపిరి సలపనీక ఉక్కిరిబిక్కిరి చేస్తూ కలత నిదురను మిగులుస్తుంటే

కానరాని దూరాలకు కలవని తీరాలకు సంద్రం ఒడ్డులకు సెలయేటి వాగులకు నిర్బంధం చేసి
ప్రేమే ద్వేషమో ద్వేషమే ప్రేమో ఆప్యాయతే అనురాగమో తెలియక సతమతమౌతుంటే

This is not a Pessimistic Poetry, This is one of its kind.. :)

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల