అసలు సిసలు మనిషి
కనురెప్పలకు కనుపాపను కాపాడమని ఎవ్వరు చెప్పరు
దెబ్బతగిలితే మానిపోమని గాయానికి ఎవరు చెప్పరు
దుఃఖం కలిగితే కన్నీరు రావాలని కంటిపాపకు ఎవరు చెప్పరు
బాధలో ఉన్నప్పుడు సాంత్వన ఇవ్వాలని ఎవరు చెప్పరు
కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే తుడిచే చెయ్యి, ఏడుపోస్తే తలవాల్చె భుజం ఎప్పటికైనా ఉండాలి
మనిషిని ప్రకృతి లోని జంతువుల కన్నా వేరే అన్నప్పుడు మనిషి మృగం లా మారకూడదు
నవసమాజ స్థాపనలో ఓ మైలురాయి అయ్యి నిలవాలి కష్టం కలిగితే ఓదార్చే మనసు కలిగుండాలి
మన జీవితం ఎన్నినాళ్లో తెలియని సందిగ్దం ఉన్నపుడు చెడు చేసి జనం ముందు జీవచ్చవం కాకూడదు
మనసునేరిగి నిరాడంబరత కలిగి భయభక్తి కలవాడే మనిషి
పగిలే గుండె ఏనాటికి అతకదు, అది తెలిసి గాయపరచడం ప్రేమే కాదు
ముసుగులో మంచిని నటించి చెడు చేసి నవ్వుకునే వాళ్లకు ఇవేమీ అర్ధం కాదు
రెప్ప మూస్తే జననం రెప్ప ముస్తే మరణం ఇది తెలిసి మసులుకున్నవాడే అసలు సిసలు మనిషి