మనసుకు తెలిసిన ఆగంతకుడు

అతివ ఆలోచనలు  అర్ధం చేసుకోవడానికి అతడికి చాల సమయం పడుతుంది
మగువ మనసుని అర్ధం చేసుకోవడానికి మగాడికి చాల సహనం కుడగట్టాల్సి వస్తుంది
అమ్మాయి చిరునవ్వు వెనక దాగే  భావాల కన్నా ఆ భావాన్ని వెతకడంలోనే సమయం పడుతుంది
కరిగే మబ్బైన వెంటనే చినుకై హరివిల్లులతొ జోరు  వానై మేనుని తడుపుతుంది
కాని అమ్మాయి కన్నీటి చుక్క ఎందుకు వస్తుందో అంతుచిక్కనిది

ఆప్యాయత నిండిన కన్నుల్లో దయాగుణం కలిగిన మనషులకు అహం అనే మచ్చ మిగిల్చే పరిణామమిది
ఓ కొడుకుగా అన్నగా తమ్ముడిగా భర్తగా తండ్రిగా తాతగా ఇలా ఒక్క రూపానికి ఇన్ని పేర్లు ఉన్నప్పుడు
సాటి మానవత్వ గుణం ఎందుకు రోజురోజుకి దిగాజారిపోతోంది, మానవత్వ విలువలు ఎందుకు తరిగిపోతుంది
ఆలోచనలే కాదు ఆచరించడం కూడా మనిషి నేర్చుకున్ననాడే తన అస్తిత్వానికి తన ఉనికిని చాటుకునే శక్తి ఉంటుంది

పుట్టేటప్పుడు అందరు ఒకలానే పుడుతారు చిన్నారుల్ల పరిస్థితులే మనిషిని పతనం వైపునకొ ఉత్థానం వైపునకొ కదిలిస్తుంది
వేసే ప్రతి అడుగు కాలచక్రం లో మిళితమై సమ్మిళితమై ఉన్నప్పుడు ఆ అడుగు జాడల్లో మంచి అనేది అలవర్చుకుంటే ఆ జన్మ సార్థకత ఆ పుట్టుక చరితార్థం 

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం