ఆవేదన
Image Courtesy: stockvault.net |
అంతుచిక్కని ఆకాశం అని తెలిసిన రెక్కలు చాచి అందుకోవాలనుకుని బొక్క బోర్ల బడ్డాను
అనంతమైన భావాలు మదిలో ఏవో రేగి, ఏ భావం ఎక్కడ మొదలైందో తెలియని తికమకలో మునకెసాను
అందని చిరుగాలి అని తెలిసిన వినిపించి కనిపించని అందెరవం విని వెఱ్రి పరుగులు తీశాను
నెలకెసిన బంతిని గట్టిగ విసిరితే నా మోముపైనే గాయం చేసింది, చాల దూరం అని తెలిసిన కోరాను
తెలియని తీరం వెంబడి నాలుగు నెలల రెండు వారాల ఓ రోజు తనవెంట తన పలుకులని చూస్తూ గడిపాను
ఇన్నాళ్ళకు తేరుకుని నన్ను నేను చూసుకుంటే:
మానని గాయం అని భ్రమించిన ఆ గాయాలు ఏనాడో మాయమైపోయాయి
భారం అని ఇన్నేళ్ళు గుండె బరువెక్కి ఉన్న ఏనాడో తెలికపడిపోయాయి
తన జ్ఞాపకాల దొంతర ను చీల్చుకుని కావ్యమై మీ ఎదుట అక్షరం అయ్యి నిలుచున్నాయి