Posts

ఎచటికో నా పయనం

Image
2007-2014 Kaavyaanjali ఎచటికో నా పయనం ముళ్ళ బాట అని తెలిసినా కారు మేఘాలే ఉరిమి పడుతున్నా నదిలా మారి నా అంతం సముద్రమని తెలిసినా ఎచటికో నా పయనం కంచె వేసి గుండెను గాయపరచినా ఊపిరి బిగపట్టి నిట్టుర్పుల సెగలై ఆశలు కాలిపోతున్నా సెగను తాకి ఆవిరి మెఘమై చిరుజల్లులై పుడమిలొ కలిసిపోతానని తెలిసినా ఎచటికో నా పయనం భావాలు మైనమై ఆవేదనతో కరిగిపోతున్నా నన్ను నన్నుగా ప్రేమించే వారికోసం డివిటిలా మారి వెలిగి పోతున్నా స్వచ్చమైన స్నేహానికి ప్రతీకగా బండబారిన హృదయం పై శిలాక్షరమై మిగిలిపోతానని తెలిసినా [నా ఈ కావ్యాంజలి బ్లాగ్ నేటితో ఏడూ వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ తరుణాన ఈ కవిత ]

వాలుచూపులు వేచి వీక్షిస్తున్నాయి

Image
నిజం నిప్పని నింగిలో నిగారింపు నీలవర్ణాల నిండు నెలవంక  దరికిరాక దాపరికాలు దోబూచులాడే దిక్కులవెంట  కరిగే కన్నీరు కలతలను కొలిచేవా కనులకు కానవచ్చే కమ్మని కలలా  గతి గమనం గోచరించి గాలిసైతం గగనానికేగి గింగిరులుకోడుతుంటే  తదేకంగా తపనతీరక తనువంతా తిమిరాన్ని తచ్చాడుతుంటే తాత్పర్యాలు తెలియక తికమకలో  రాగద్వేషాలు రంగరించి రేయిని రంగులద్ది రకరకాలుగా రూపుదిద్దుకున్న వెతికే వాలుచూపులు వేచి వీక్షిస్తున్నాయి వరాల వాన వస్తుందని విరబూసే వెలుగుపులు వసంతానికి విన్నవించటానికి వీనుల విందుగా వినటానికి 

The Nature's Fury

Image
Those were the days, when Ukkunagaram-The Steel City, was lauded for the Lush Greenery that was unique in its own. It was that horrifying moment, when the Cyclone dragged and pulled each and every tree out of its strong hold, the nature has shown. Tree Facing Our Quarter The Lane that was After the Cyclone Garden and Road in Vain Road to Shopping Complex Blocked Road Leading to Shopping Complex Another View Road Connecting Main City to the Steel Township Nature was not this merciless before. See how it has been a cause of concern. The day started with light showers slowly turned into violence With winds as high as 350kmph and trees bowing in twisting and bending them as worst as possible that took away peace in  silence All we could see was trees and trees surrounded, not as before that gave shade. But only as the broken bones of the Earth that is stored in our memories only to let them get fade. A Violent Shake of 5...

నన్ను చూడు ఏం కనిపిస్తుంది?

Image
నన్ను చూడు ఏం కనిపిస్తుంది ? అలల మాటున రేగిన అలజడి కనిపిస్తుందా  లేకా వాటి నడుమ లెక్కకు మించిన నీటి బొట్టు కనిపిస్తున్నదా చంద్రుడు ఉన్న లేకున్నా నేనెప్పుడు కాలం వొడిలో ఊయలూగే అలనే  కంటికి కునుకంటూ లేక ఓలలాడించే సాగర ఘోషనే  నన్ను చూడు ఏం కనిపిస్తుంది? వెలుగులు కోల్పోయి చీకటి అలుముకున్న కాలం కనిపిస్తుందా  లేకా రేపటి వేలుగులకై వేచి చూసే నిశి రాతిరి కనిపిస్తున్నదా  చంద్రుడు ఉన్న లేకున్నా నేనెపుడు పగటికి కాలాన్ని వెళ్లదీసే తిమిరంధకారాన్నే  కాలం వొడిలో నీకు హాయి కలిగించి రేపటి వేకువకై నిన్ను చేర్చే రాతిరినే  నన్ను చూడు ఏం కనిపిస్తుంది ? వంకర్లు తిరిగి భావం ఏదో మరిచి ఒంటరిగా మిగిలి ఉన్న అక్షరం కనిపిస్తుందా  లేక తనలో దాగి ఉన్న శక్తి కై వేచి చూసే భావం ఒరవడి కనిపిస్తున్నదా  ఇటుకటు అటుకిటు మార్చి మార్చి ఓ భావానికి శ్వాస ఇచ్చిన అక్షరాన్నే నీ మదిలో దాగిన భావాలను అక్షరరూపం లో పొందు పరిచే కవిత్వాన్నే  నన్ను చూడు ఏం కనిపిస్తుంది? ఆమడ దూరం లో ఉన్న ఆకాశం పాదం కింద ఉన్న భూమి కనిపిస్తుందా  లేకా ప్రకృతిలో ఇమిడి ఉన్న జీవరాశికి ఊ...

వేదనకు సాక్ష్యం

Image
మాటే మౌనమై మదిలో ఇలా దాగేనా  ఋతువులు మారినా పుడమిని తడిమేనా  కాలగమనమె దరి చేర్చుతుంది ఎవరినైనా  ఒర్పులో మార్పు రానీకు ఏ రోజైనా కన్నులు పలికే భాషలు మూడు  ఆనందం నిండిన కనులను చూడు  బాధలో ఉన్న కన్నిరుని చూడు  లోకాన్నే తనలో బంధించే చిన్ని గవాక్షాన్ని పరికించి చూడు    వేవేల భావాలతో లయబద్దంగా కొట్టుమిట్టాడుతున్న గుండె సవ్వడి  కాలానికే అందక పరుగులు తీసేనా ఏమో ఎప్పుడైనా పొరబడి  కల్మషం ఎరుగని భావన ఏదైనా ఉంటె దాచుకో మదిలో త్వరపడి  ఒర్పులో చేర్పులో పలుకులో రానీయకు ఏనాడు బాధను వెంటపడి  కలలరూపం కావ్యాలలో ఇమిడే అక్షరాలగా  ప్రతి అక్షరం ఓ భావనకు ప్రతీకగా  మాట మునమైనా మదిలో భావానికి ప్రతిరూపంగా  వెలిసే నేడు ఇలా  మౌనం నవ్వులు వేదనకు సాక్ష్యం గా  

బంధమంటే

Image
మిన్నుకి పుడమికి గల బంధమేమి ? చెలిమి బంధమే కాదా  కనుకే  చీకటి వెలుగులు పుడమికి అందిస్తుంది ! సంద్రానికి చంద్రానికి గల బంధమేమి ? చెలిమి బంధమే కాదా  కనుకే  చంద్రుని గమనాన్ని బట్టి అల కదులుతుంది  సూర్యునికి చంద్రునికి గల బంధమేమి ? చెలిమి బంధమే కాదా  కనుకే  చీకటి లో చిన్నబోయిన చంద్రుని తన వెలుగులు పంచి వెన్నెల కురిపిస్తుంది  వసంతానికి కోయిలకు గల బంధమేమి? చెలిమి బంధమే కాదా  కనుకే  వసంతాల వేల కోయిల కుహుకుహురాగాలు మిళితం చేస్తుంది  మనిషికి మనిషికి గల బంధమేమి  చెలిమి బంధమే కాదా  కనుకే ఆప్యాయతతో పలకరిస్తే ఆ బంధమే ఋణానుబంధం అయ్యి నిలుస్తుంది 

ఆలోచనలు

Image
కన్నులకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి లోకాన్ని లోకం లో రంగులన్నిటిని తన కంటిపాపలో నిగుడితం  చేసుకుంటుంది కదా ! చేతులకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి మనసు పలికే భావాలన్నిటిని అలవోకగా వర్ణాల్లోకి మార్చేస్తుంది కదా ! పాదాలకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి కనులకే కనపడని దూర తీరాలకు మన గమ్యాలకు చేరవేస్తుంది కదా ! మనసుకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ? మరి ఎదురుగ నిలిచినా మనసు భాషను చెప్పకున్న అర్ధం చేసుకుంటుంది కదా !