Posts

కొరోనా సిన్స్ మార్చి ట్వెంటి ఫోర్ ౨౦౨౦ ఆన్ వర్డ్స్

కంటికి కానరాని బూచి ఏదో దోబూచూలాడుతోంది తుమ్మినా దగ్గినా ముట్టినా మొట్టినా మాట వినని మోండిది దేశాటనమంటు బయలుదేరి కుప్పతెప్పలుగా ఈ అణువంతది చివరాఖరునా మ్యాస్క్ యాప్రన్ సామాజిక దూరాల షర్తులతో ఎక్కడివారక్కడే ఎవరికివారై గప్ చుప్ ఉండమంటోంది లేని యేడల మహమ్మారియై కాటు వేయగా నిర్దయ చూపే కోరలు లేని కొరోనా రక్కసొకటి లాక్ డౌన్ తో సతమతమౌతూనే ఆరోగ్యానికై సమాయత్తమౌతు జన సంద్రం

వ్యత్యాసమిదేనా

మీ స్థాయి తెలిసి కూడా నీ గుణం గాఁచి పెళ్ళి చేసుకున్నా మీ వాళ్ళు కేవలం నా వెనుకనున్న ఆస్తి చూసి నిన్ను ఎరగా వేశారని తెలుసుకోలేక పోతున్నావ్ ఐనా జీలకర్ర మెంతులు లాటి దినుసులనే కొనుగోలు చేయగలిగే కుటుంబంలో పుట్టిన నాకు బుడ్వీజర్ బ్లాక్ డాగ్ కొని తాగి తూగే కుటుంబంలో పుట్టిన నీకు బహుశ ఇదే వ్యత్యాసమేమో బాడుగ ఇంటిలో అపుడపుడు ఎగవేతలు కోతలతో సతమతమవ్వుతూనే ఇతరులను హేళన చేసేవారు కష్టార్జితంతో సొంతిల్లు నిర్మించి వేరొకరికి బాడుగకు ఇస్తే రూపాయి కూడా అందులో పెట్టుబడి లేని మీకు మాపై కసురుకూనే హక్కు ఇచ్చిందెవరు ఐనా కందులు మినుములు లాటి నిత్యవసరాలనే కొనుగోలు చేయగలిగే కుటుంబంలో పుట్టిన నాకు ఆఫిసర్స్ చాయిస్ సిగ్నేచర్ కొని తాగి తూగే కుటుంబంలో పుట్టిన నీకు బహుశ ఇదే వ్యత్యాసమేమో పాతిక లక్షల సరిసమానంగా కట్న కానుకలు ఇచ్చి కూతూరి వివాహం చేయాలనుకూని కోరుకున్న వాడిని కట్టుకూని అరవై మూడు లక్షల నగదును ఒక్క దఫాలో ఇచ్చి సాగనంపారు కట్నం ఊసెత్తకుండా వివాహం చేసుకుందామనుకూనే తరుణంలో మేమేమి తక్కువ కాదని కలుగచేసుకుని మరీ పన్నెండు లక్షలు ఇస్తామని రెండు లక్షల ఎనభై వేలకు సరితూగే బంగారు నగలు కొని సర్దిచెప్పుకున్నా...

పీడ కలలా..

ఎవరో చేసిన పనికి తలవంపులెందులకు వారిరువురికి సమ్మతమట మనకెందులకు తర్జన భర్జన పడుతోందా మనసు అడుగెందుకు మాయ విశ్వం ఇందలి సూక్ష్మం గ్రహించేందుకు మధన పడరాదు దిక్కులన్ని పెక్కటిల్లెటందుకా శిరోభారమై కంటతడిని సైతం చూసి చలించేటందుకా దాటి పోయింది చేయి వాత్సల్యానికే కాలం చెల్లిపోయింది కనుకనే కనికరం లేకుండ మమ్మొదిలి వాడితో జతగా పిన్న చెల్లి వెళ్ళిపోయింది

ఋణం~ దారుణం

లోకం తీరు చేదు నిజం "వారిరువురు రెండు నెలల వ్యవధిలో స్వలాభాపేక్ష తో నటించి ఏడు పదుల శత సహస్రాలను మూటగట్టుకున్నారు." "ఇతనొకరు స్వార్థరహితంగ రేయిఁబవళ్ళు కష్టార్జించి పైసా పైసా కూడబెట్టుకున్నారు." "వారిరువురు కైకేయి మనస్తత్వంతో వీరి ఒక్కగానొక పుత్రుణ్ణే వీరి నుండి దూరం చేసే పన్నాగం రచించారు." "ఇతనొకరే కుటుంబమంత కలిసిమెలసి ఉండాలనే భావనను ఇన్నేళ్ళుగా నిలబెడుతు వస్తున్నారు." "మంథర వాదమో కైకేయి పంథమో రాముడిని అయోద్య నుండి పదునాలుగేళ్ళు దూరం చేశారు." "మాయలేడి ఇంద్రజాలమో శూపనఖ కనికట్టో ఆనాడు రాముడిని సీతను వేరు చేశారు." "ఇన్నాళుగా తనపై ఉన్న వాత్సల్యతను వీరిరువురి స్వార్థంతో జీవితాంతం దోషిలా నిలబెట్టాలనే పన్నాగం పన్నీనారు." "వారికి రావలసిన మొత్తాన్ని వీలైనంత తక్కువ సమయంలో చేజిక్కించుకున్నారు." "అన్ని ఉండి కూడా కన్నవారి ఆదరణను నోచుకోనీకుండ అయోమయంలో నెట్టేశారు."

అజాత శత్రువు

మైఁ అజాత్శత్రు థా.. పతా హి నహి థా కి ఏక్ ఐసా భీ దిన్ ఆయేగా జబ్ అపనే హి పరాయే హుఆ కరేఁగే ఔర్ పరాయా కోయి అప్నా శత్రు బన్కర్ ముసీబత్ ఖడా కర్దేగా..! అప్నే పరాయే కా ఖేల్ మేఁ కుద్రత్ కి క్యా ఖాసియత్ హై సిర్ఫ్ ఇస్కా అందాజా ఆఖిర్ వక్త్ కే దౌరాన్ హి లగా సక్తే హైఁ

కోవిడ్ కరోనాకాష్టం

అమ్మా.. భారతావని.. ఎపుడు సస్య శ్యామలమై విరాజిల్లే నీకు.. ఈ కరోనాకాష్టం పచ్చదనంలో అరుణవర్ణం కలిపింది తల్లి.. తల్లడిల్లే రెమ్మలం.. దిక్కుతోచక హాహాకారాలు సైతం చేయటానికి విలు పడక మ్యాస్క్ తో నోటిని.. బరువెక్కిన కంటిలో చెమ్మను సైతం.. బయట అడుగుపడనీక.. లోలోపలే గాలిలో ఆరబెట్టుకుంటున్నామమ్మ.. నిప్పు ఒకసారే రాజుకుని కారడవినంతటిని బుగ్గిపాలు చేస్తుంది.. ఈ కోవిడ్ కలకలం కలహాలకు అతీతమై.. క్వారెన్‌టైన్ తో ఛిన్నాభిన్నమై.. ఐసోలేషన్ మూలాన డిప్రెస్డ్ అయ్యి మరి కొందరు.. ఇహ.. ఈ కార్చిచ్చు ఎవరిని దహిస్తుందో.. ఎవరిని సహిస్తుందో.. కాలమే నిర్ణయించాలి.

March 22, 2020~March 24, 2020 CoViD 2019

ఇసుక రేణువంత కూడా లేని కోవిడ్-౧౯ వైరస్ జన సంద్రాన్ని అతలాకుతలం చేసేంతగా ఇంటిలోనే ఉండాలని ప్రతి ఒక్కరిపై ఫోకస్ హుబేయి వుహాన్ నుండి ఇంపోర్ట్ అయ్యిందిగా ఎక్కడ చూసినా ఇదే మ్యాటర్ అవుతోంది డిస్కస్ మాస్కులతో ఓవర్ కోట్ లతో ఐసోలేషన్ పకడ్బందిగా నాలుగు ఖాండాలలో వ్యాపించి మార్చేను ప్రపంచ స్టేటస్ వ్యవహరించాలి లాక్ డౌన్ లో మనమంత దురుసుగా అపుడే కొంత లో కొంత మేరకు చల్లబడుతుందేమో రక్కస్