Posts

ఏమి ఇచ్చుకోగలను కృతజ్ఞత తప్ప

 నేను పుట్టిన ఊరు నన్ను మూడేళ్ళు సాకితే.. నన్ను పెంచిన ఊరు ముప్పై ఏళ్ళు సాకింది.. ఏమిచ్చి ఋణము తీర్చుకోగలను వైజాగపటమా..! చదువు సంస్కారం నేర్చుకున్నది ఈ వైశాలినగరములోనే..!! మర్యాద గౌరవం పొందింది ఇక్కడే.. సొంతిల్లు నేను పుట్టిన ఊరిలో కట్టించుకున్నాము దాని మూలానా నా వివాహనంతరం అక్కడే బస చేయాలని తీర్మానించుకున్నా గాని, మనసొప్పకా గడచిన రెండున్నరేళ్ళు  కూడా వైజాగపట్టినములో ఉన్నాము.. నాన్న గారికి మరో ఐదేళ్ళ ఐదు మాసాల తరువాయి రిటైర్మెంట్ గనుక వారు సొంతింటికి రాలేని పరిస్థితి.. బాడుగా కి ఇస్తే కష్టపడి కట్టుకున్న ఇంటిని ఎలా ఉంచుతారో తెలియని అనిశ్చితి.. గనుక నేను తప్పనిసరిగా సతి సమేతంగా సొంత గూటికి చేరే సమయం ఆసన్నమయ్యింది.. కాకపోతే అందరు క్షేమంగానే ఉండాలని నా మనఃసాక్షి తో మనఃపూర్వకంగా కోరుకోవటం తప్ప ఏమి ఇచ్చుకోగలను..! 

ఎటు తేల్చని సంధిగ్దత

 భార్య పిల్లలు ఒక చోట భర్త మరోచోట తనకు తానుగా ఊరేగి వెళ్ళింది భార్య వ్యత్యాసాలకు తావు యిచ్చే విధముగా నాలుగున్నర మాసాల యెడబాటు యింటి యిల్లాలిని యేలుకోవాలని తపన మొండి ఘటానికి లేదు రాదు ఆలోచన నను నా వాళ్ళకు దూరం పెట్టాలనే వారి యాతనో యిల్లు బాడుగలో భార్య మడుగులో భర్త అయోమయంలో రేపటి జీవితానికి నాకే నన్ను శత్రువు చేసే యోచన విధి రాత యే మలుపు తిరిగేనో తెలియని ఆవేదన కనిపెంచిన తల్లిదండ్రులు తల్లడిల్లే ఓ వైపు కట్టుకున్న భార్య కన్న బిడ్డ ఆవేశం ఓ వైపు తల్లడిల్లుతున్న మనసు ఎటు తేల్చుకోలేక కోవిడ్ మహమ్మారి ఆనాటికి ఎంతగా పెరిగేనో తెలియక 14 Jun 2020~13 Jul 2020 14 Jul 2020~ 13 Aug 2020 14 Aug 2020~13 Sep 2020~ 09 May 2020~08 Jun 2020 09 Jun 2020~08 Jul 2020÷ 09 Jul 2020~08 Aug 2020 09 Aug 2020~08 Sep 2020 09 Sep 2020~ 08 Oct 2020 ~ 09 Oct 2020~08 Nov 2020 09 Nov 2020~08 Dec 2020 09 Dec 2020~08 Jan 2021* 09 Jan 2021~08 Feb 2021

విధీ

 విధి ఎంతో విచిత్రం తెలిసి తెలియని వింత నాటకం క్షణ కాలం ఉబలాటం మరు నిమిషం నిర్వేదం అల్లుకుపోయే బంధాలు కొన్ని చెంతకు చేరిన చేరువ కానివి కొన్ని రాగద్వేశాల భావోద్వేగాల జీవితం చూసి చూడని ఘటనల సమాహారం ఎనలేని మమకారాల తేనెపట్టు కొన్ని బంధాలు మనిషికి మనిషికి నడుమ మరికొన్ని బంధాలు మనసుకి మనసుకి నడుమ కొందరి జివితాలు తెరిచిన పుస్తకాలు మరి కొందరివి మండుతున్న ఆశల అగాధాలు కొందరు జీవితాన్ని వెక్కిరిస్తారు మరికొందరు అదే జీవితాన్ని ఔపోసన పడ్తారు కాలగమనంలో అందరి పయనం (అటే) అయినా ఏలా ఇలా దాపరికాలు.. మమతానురాగాల మాటు రేగే వింత ప్రశ్నలు కొన్ని బంధాల నిడివి కొద్ది కాలమైనా వాటి విలువ జీవితకాలం గుర్తుండిపోతాయి ప్రకృతిలో శిలాక్షరాలై మిగిలిపోతాయి మరికొన్ని ఇసుక తిన్నెలుగా మారి సంద్రపు అలల నురగలై ఉవ్వెత్తున ఎగసి మరలి వెళ్ళిపోతాయి జీవితమనే పుస్తకమే మనది, అందులో కోపతాపాలు బంధాలు బాంధవ్యాలు ప్రేమలు ఆప్యాయతనురాగాభిమానాలు కష్టసుఖాలు కలబోసిన ఓ కమ్మని కావ్యమాలిక

భార్య భర్తల అనురాగాత్మీయ బంధం

  భార్య గౌరవం తన భర్త అడుగు జాడల్లోనే ఉంటుంది. వైవాహిక బంధం తో ముడి వేసుకున్న ఆడ పిల్ల పుట్టినింటి పరువు ను మెట్టినింటి మర్యాద ను భర్తకు తోడుగా భర్తయే నీడగా తలచి కాపాడు కోవాలి. సీతమ్మ తల్లి రాముని వెంట అడవులకు సైతం పయనమయ్యి సాధ్వి అనిపించుకున్నారు.. కనుకనే నేటికి ఆదర్శ దంపతులు సీతరాముల వారే..! ~శ్రీత ధరణి

SpEcIaL eFfEcT

 కు..తో..వం.. ఎ..పి.. వా.. ఆ.. ఊ.. పె.. కు.. హ.. కలత చెందిన మనసు వేదన నిండిన హృదయం

అక్షువులు

 అపురూప దృష్యాలను అలవోకగా బంధిస్తు.. వాటిని జ్ఞాపకాలుగా మలచి.. నింగి నేల నడుమ నిచ్చెనలా.. నిన్న కి నేటికి నడుమ వారధిలా.. కవల కలువ కుసుమాలుగా ముఖారవిందంపై కలలకి వాస్తవాలకి చిరు చెమ్మకి భాష్ప తుషారానికి ఆనవాలు * అక్షువులు *

కాలం

నే పుట్టి మూడున్నర దశాబ్దాల నాటి నుండి ఏనాడైనా అనుకున్నానా ప్రాచిన సాంప్రదాయమైన మన నమస్కారం ఇలా షేక్ హ్యాండ్ దాక వచ్చిన టెక్నాలజిని దాటి మరల నమస్కారం యావత్ ప్రపంచానికే సోకిన కరోనా ను కాస్తో కూస్తో కట్టడి చేసే సాధనమై నిలుస్తుందని.. ఈ మూడు పదుల  ఐదు ఒకట్ల వయసులో సైతం ఒకరితో ఒకరికి ఉత్తరం నుండి వృద్ధి చెంది ల్యాండ్ లైన్ దాటుకుని సెల్ల్యూలర్ మొబైల్ ను మించి డిజిటల్ బ్రాడ్ బ్యాండ్ తో విడియో కాన్ఫరెన్స్ ఐతేనే ఈ కోవిడ్ కాలమున సరైన ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు ఉంటుందని. ఈ ముప్పది ఐదు ఎండ్ల నాటి సంధి ఏ మారు మూలాన సైతం కిక్కిరిసిన జనం గగ్గోలు వింటు.. ట్యాక్సి, బస్ ట్రేయిన్, ఏయిరోప్లేన్ లలో నిత్యం సందడి కాస్త అటు ఇటుగా ఇరవై ముప్పై మించ కూడని ప్రయాణాలకు దారి తీస్తుందని గడచిన ముప్పై ఐదేళ్ళలో దగ్గు కి బెనాడ్రిల్ సిరప్ లేదా అజిత్రాల్ ౨౫౦ ట్యాబ్లెట్లు, జలుబు కు సెట్రిజైన్ హైడ్రోక్లోరైడ్, జ్వరానికి వోవెరిన్, పెరసెటమాల్ మాతరలు వేసుకుంటే ఇట్టే నయమయ్యే షరామామూలు కాస్త పెచ్చుమీరి అలాటి లక్షణాలనే పోలి ఇలా ఇలాఖాలలో వణుకు పుట్టించేదిగా పరిణితి చెంది మ్యాస్క్ లను సైతం బట్టలలో భాగం చేసేటంతగా భయభ్రాంతులకు గురి...