నేటికి మా పెళ్ళై రెండేళ్ళు దాటి పది నెలల ఇరవై ఏడు రోజులు. విషయం ఏమంటే: ఈ రోజు తన పుట్టిన రోజు.. నిశ్చితార్థం అయిన నెల రోజులకే తన పుట్టిన రోజు: తన కోసం నేను నేవి బ్లూ మెష్ చీరను హనుమకొండ దరి మాంగళ్య షాపింగ్ మాల్ నుండి తనకోసం బహుమానం గా తీసుకెళ్ళా.. తనతో సరదాగా గడుపుదామని వారింటికి వెళ్ళినాను.. తాను అపటికే ఆరెంజ్ చూడిదార్ వేసుకుని ఉంది.. చీర తీసుకెళ్ళి బీరువాలో దాచేసింది, ఎందుకని అడిగితే వారి అమ్మమ్మ వారింటికి బయలుదేరే సమయానికే నేను అక్కడికి వెళ్ళటం జరిగిందట.. మరుసటి సంవత్సరం తన పుట్టిన రోజు నాటికే తాను ఏడు నెలల గర్భవతి, వారి పుట్టింట్లో ఉంది, ఐనా గాని నాతో బీజ్ కలర్ లాంగ్ ఫ్రాక్ కావాలని చెప్పింది., కొని పట్టుకెళ్ళా విశాఖపట్నం లో గాజువాక సౌత్ ఇండియ షాపింగ్ మాల్ నుండి, తను ఆ ఫ్రాక్ ను ఓ అరగంట వేసుకుంది అంతే.. [గర్భవతి కదా అని నేనే ఎక్కువ సేపు ఫ్రాక్ వద్దంటే వేంటనే నైటీ వేసుకుంది.. ఆ తరువాయి సంవత్సరం సీ యమ్ ఆర్ షాపింగ్ మాల్ లో ఓ లైట్ వీట్ కలర్ టాప్, నేవి బ్లూ కలర్ చూడిదార్ మరియు మల్టికలర్ శారి కొన్నది. తీరా తన పుట్టిన రోజు నాడు ఓ అరగంట వేసుకుని, పది నెలల మా పాపకు పాలు పట్ట...