Posts

ప్రకృతి సోయగాలు

Image
Image Courtesy: Patrice Sery (Picasa)  Image Courtesy: Kelly De Lay (Picasa) పూల పరిమళాలు తన వెంట తెచ్చే ఆమనిని ఆస్వాదించాలంటే ఉన్న సమయం చాల తక్కువ చిటపట చినుకుల అందేలా రవళి తో తన్మయత్వం తెచ్చే వర్ష కాలానికి వ్యవధి తక్కువ లేలేత కుసుమాలు వన్నెల రామ చిలకలు చిన్నారి చిందులు చూడాలంటే మక్కువ ఎడారి లో వర్షం పడితే వింత. భావం అర్దమయ్యేది మేధాకైతే స్పందన హృదయం లో తెలుస్తుంది హృదయానికి తెలిసిన వెంటనే ఏ సంబంధం లేని కన్నులనుండి దారాలు గా కన్నీరు రాలుతుంది మనసుని ఆహ్లాదపరిచే ఆమని కి నిడివి తక్కువ ఐన చూసే కన్నులకు పండుగ అవుతుంది రెక్కల సీత కోక చిలుక తన వెంట ఆకాశం లో రంగుల్ని పోగేసి చీర చుట్టుకున్నట్టు వెన్నెల అందాలు కంటికే కలత తెచ్చి పెట్టె చీకటికే పరిమితమై సొంతమైనట్టు గాలికి తనతో పాటు రెక్కలు తొడిగి కొత్త ప్రదేశాలకు వెళ్లినట్టు మనసు మమత ఆప్యాయత రంగరించి రంగుల హరివిల్లు ఆకాశ వీధిలో ప్రకాశిస్తుంది వెండి వెన్నెల మాటున నిండు జాబిలీ మబ్బులతో దాగుడు మూతలు ఆడుతుంది వేల చుక్కల సాక్షిగా తన కఠోర స్వభావం విడిచిపెట్టి  తిమిరం ఉషోదయం  అవుతుంది  

కవితంటే :

సుందర సుమనోహర సునిశిత భావాలంకృత పదబంధం అది ఎలా ఉన్న దానిలోని అంతరాత్మ మన అంతరాలను చెరిపి వేసే ఓ అక్షర వాహిని మదిలోని భావాలను కట్టడి చేసి ఓ దారిలో పెట్టె ఆనకట్ట భావాలను ఏర్చి కూర్చి సమతుల్యత కలిగించే అక్షర నిధి మదిలోని ఆలోచనలన్నీ కలగలిపి మాటల్లో చెప్పలేని దాన్ని పలకరించే పెన్నిధి ఎన్ని జనమలైన తరిగిపోని ఎంత లోతుగా ఉన్న మదిలో తేలే కమ్మని మృదు తరంగిణి మనిషి మస్తిష్కం నుండి వెలువడే భావ తరంగ ధ్వని మూగాగానైన తన భాషను ఇతరులతో పలికించే స్వరాల హరివిల్లు అన్ని కాలాలకు వసివాడని ఓ కమ్మని అనుభూతి అన్ని కాలాల్లో ఒకేలా ఉండే ఓ అపురూప భావాల ఝరి ఎంతటి బాధనైన తనలో ఇనుమదిమ్పచెసె ఓ రాగాలాపన భావాల మంజరి ఎలాంటి భావాన్నైనా అలవోకగా పలకించే అలివేణి ఆణిముత్యం 

ముసుగు

కన్నులు మూసి మనసు ద్వారం తెరిచి లోపల  తొంగి చూసా కన్నులు చూసింది చూసినట్టే ఉన్న ఆ కొలను లో బాదతాప్త అశ్రువులు పొంగి పొర్లుతున్నాయి ఏవో ఆలోచనలు ముసిరి గొంతుచించుకుని అరచిన వినపడలేదు ఆ ఆలోచనల మాటున ఏదో ఆవరించినట్లు ఉంది మనసంతా కాకవికలమౌతు ఉంది ముసుగు లో బయటకు లబ్ డబ్ మంటూ  లయబద్దంగా వినిపించే హృదయ స్పందన లోలోపల మాత్రం లయ తప్పింది ఏదో తెలియని వెలితి ప్రస్ఫూటముగా కానవస్తుంది. కోయిల కూస్తూ ఉన్న స్పందన కరువయ్యింది వసంత మాసం ప్రకృతి ఐతే తెచ్చింది కాని మనసుకి మాత్రం గ్రీష్మ ఋతువే అన్నట్టు విలవిల్లాడుతుంది ఆ తాపం మాటున ఏదో తెలియని గాయం రేగుతున్నట్టు ఉంది మనసంతా కాకవికలమౌతు ఉంది ముసుగు లో ఏదో దక్కి దక్కకుండా చిక్కి చిక్కకుండా వెక్కిరించి వెళ్లినట్టు మనసు వెక్కి వెక్కి ఏడుస్తుంది నాకు అది తెలుస్తూనే ఉంది ఆ తాపం ఆ విరహం ఆ తడి కన్నుల ఆరాటం లోలోపల మోమాటం వెన్నెల వేడిమి లో ఎండా చలి కాస్తున్నట్టు ఏవో తారుమారు ఆలోచనలతో మనసు మనసులో లేదు ఆ వైపరీత్యాల మాటున ఏదో వ్యాకులత దాగి ఉన్నట్టు ఉంది మనసంతా కాకవికలమౌతు ఉంది ముసుగు లో 

క'వనం'

  అలా ఒక సారి నేను ఈ వనములో అడుగుపెట్టా  నా భావాలను తన వేరులుగా మలిచి నిటారుగా  ఎదిగి ఒదిగిన కవి'తరువుల్ని' చూసి తన్మయత్వం తో మురిసిపోయా    నా భావాలు ఇందులో అలరారుతూ అలుపెరుగక ఊయలూగుతూ  ఆ కమ్మని నీడలో సేదతీరుతు  పలకరిస్తున్న మీ అందరికి  ఆరేళ్ళుగా మీ ఆదరాభిమానాలు చొరగొంటున్న ఈ కావ్యలఝారి ని  ఆశిర్వదిస్తునందుకు పేరు పేరున అందరికి నమః సుమాంజలి 

యశోద-కృష్ణ

మిక్కిలి కోపము అటు పిమ్మట శాంతం ఇలా నవరసంబుల సమ్మేళిత పీతవసన ప్రియ బాంధవుడు గోపికల నాయన మనోహరుండు శ్రీ కృష్ణ పరమాత్మగున్ ఇచ్చిన మాటను చేసిన బాసను మరువకన్ వెలసి వచ్చినాడు  నాడు వసుదేవుని తో కాళింది కడలిలో మమేమకమై తన రాక తో బృందావనం వేల రెట్లు ప్రజ్వలోజ్వాల కాంతులీనుతూ మురిసెన్ లొకాలొకముల్ కాంతిని విరజిమ్ముతూ నాయనానందకరమగున్ ఆ బాలున్ని కాన వచ్చెన్ గొల్లభామల్ ఇదేట్లున్నను వెన్నలు చిలికి వన్నెల రాగం లో పిల్లనగ్రోవి తో రాగాలాపన చెయ్యుచుండేన్ పుట్టింది దేవకీ మాత ఎచటో పెరిగింది యశోదమ్మ  చెంత అలరారే శిఖిపించము వెన్నలు చిలికిన కొంటె పనేమీ చేసినను ముద్దు మురిపెం తో మన్ననలు పొందేన్ యశస్సులు కూడగాట్టేన్ చూడరే అది ఏమి చిత్ర విచిత్రమో గాని కాళింది ఒడ్డున బృందావని లో గోపిక మనః చోరుడు అనంత లోకాల పాలిటి సుఖఃదుఖః సమానశీలుడు మన ఎదుటే తిరిగిన ఆ గోపిలోలుడు గోపబాలుడు గోవిందుడు 

వేచి ఉన్న

నా ఎదుటే ఇన్నాళ్ళు ఉన్నావు మరి నన్నెందుకు  విడిచి  వెళ్ళాలని అనిపించింది? నిన్నాపే  ధైర్యం నాలోలేకన లేక నీ కోసం నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాననా ? ఎడారిలో మంచు బిందువులు సేకరించాలని చూసా నేను కాని ఇసుక రేణువు మధ్యలో ఇరుక్కుపోయా నీ కోసం జాబిలి చల్లదనాన్ని వెంట పెట్టుకొస్తే వెంటనే సూర్య రశ్మికి వేడెక్కి నా ఎదనే కాల్చి వేసాయి నీ మౌనన్ని అర్ధం చేసుకున్న నీ ఆరాటం ఏమిటో కనుగొన్న కాని మనసు మాట ఎన్నటికి వినలేక పోయా అందేల సవ్వడిని ఆస్వాదించ నీ రాక ని గమనించి ఓ వాసంతమ మరలి రా నా వాకిట్లోకి నవ్వులనే పుష్పాలతో అలంకరించి గుండెల కొలను నుండి నీకోసం వేచి ఉన్న చూడు నిండు జాబిల్లి వెలుగుల కోసం కలువ భామ వేచి చూస్తున్నట్టు  

ఆ ప్రాణం నువ్వే

నిన్ను వర్ణించాలని ఎంతో తపన పడ్డాను నిన్నెంతగా ఆరాదిస్తున్ననో నీకు తెలపాలనుకున్నాను నిన్ను నా మదిలో ఎప్పటిలాగే నిలుపుకున్నాను భావాల కెరటం ఈదాలని తాపత్రయపడ్డాను తీరా ఇప్పుడు వర్ణి ద్దామంటే భావాల సుడి లో నా అక్షరాలన్నీ చిక్కుకుని అందని తీరాలకు ఎగిరిపోయి రెండే రెండు అక్షరాలూ ఇలా మిగిలాయి నా ఊహల్లో నిన్ను తలుచుకుని రాసుకున్న ఈ కవిత్వాన్ని చూసి మది పులకించిపోయింది కాని భావం లేని నా కవిత కి ప్రాణం ఒక్కటే తక్కువయ్యింది ఎందుకంటే ఆ ప్రాణం నువ్వే కాబట్టి