Posts

ప్రాణ దీపం விளக்கு வாழ்க்கை Vizhakku vāzhkkai

నా హృదయం లో వెలిగే ప్రాణం అనే దీపం నీవు నా ప్రతి పలుకు లో జాలువారే అసమాన అక్షరం నీవు  ఏమని సంబోధించను నిన్ను, నీకోసం  ప్రాకులాడాను  నేను నన్నే నేను మరిచిపోయా  నీలో లీనమయ్య భావానికి భాష తోడులా  వచనానికి అర్ధం తోడులా  సూర్యునికి నీడ తోడులా   మెరుపు కి పిడుగు తోడులా నీకు నేను ఎప్పటికి తోడులా ఉంటాను  ఏ నాటికైనా నీ కోసమని వేచి చూస్తూనే ఉంటాను விளக்கு வாழ்க்கை நீ, என் இதயத்தில் எரிகிறது சமச்சீரற்ற பாய்கிறது என் கடிதம் ஒவ்வொரு கூற்றின் நீங்கள் நீங்கள் கவனிக்கப்பட வேண்டும் என்ன, நான் பின்பற்றி உனக்காக மறந்துவிட்டேன் நீங்கள் என்னை மூழ்கியிருந்த மொழி கருத்து கூடுதலாக உரை பொருள் கூடுதலாக சூரிய நிழல் கூடுதலாக மின்னல் போல்ட் கூடுதலாக கூடுதலாக, நான் எப்போதும் உன்னுடன் இருப்பேன்   நான் பார்க்க காத்து ஒரு நாள் Vizhakku vāzhkkai nī, en itayattil erikiratu Camaccirarra pāykiratu en katitam ovvoru kūrrin nīnkazh Nīnkazh kavanikkappata vēntum enna, nān pinparri unakkāka Marantuvittēn nīnkazh ennai mūzhkiyirunta Mozhi karuttu kūtutazhāka Urai porul kūtutazhāka Cūri

వెతుకులాట

Image
ఇమేజ్ కర్టసీ: వాల్పేపర్ వొర్తెక్ష్ నిన్ను వెతుకుతూ ఓ దారి పట్టాను వింతగా అది ఎన్ని వంకర్లు తిరిగి ఉందొ !! అలసి ఇక్కడ నేను ఆగిపోతే దరి నీదు చేరేదెలా నా గోడు వెళ్ళగక్కేదెల?? పరిపరి విధాల యత్నిస్తూ సాగిస్తున్న ఈ పయనం లో ఎన్ని అడ్డంకులో !? మండే ఎండకు ఎండుతూ కురిసే వానలో తడుస్తూ ఎన్ని మైళ్ళు తిరిగానో ?!

జలతారు వెన్నెల

Image
చాన్నాళ తరువాత  నాకు నిన్ను చూడాలనిపించింది ఎందులోనో రాసుకున్న నీ చిరునామా కోసం వెతుకుతున్న తరుణమది ఎందుకో మనసు ఆపుకోలేక నీ కలవరింతల్లో మునిగిపోయింది ఏమీ తేల్చుకోలేక  సతమతమౌతు ఉంది ఇన్నాళ్ళు నీ ఎడబాటు లో కలకాలం మన స్నేహం ఇట్లానే ఉండాలని కోరుకున్న నేను కరిగి కనికరం చూపించే సమయాన అందరాని దూరాలకు వెడలిపోయావు ఇన్నేళ్ళ పిమ్మట మళ్ళి నువ్వు నాకు కనిపించావు మనసు లోలోనే మురిసిపోయింది ఈ వేకువ కోసమని ఎన్నేళ్ళు ఎదురు చూసానో గురుతే లేదాయే నీ ప్రేమ మాయలో చిరునవ్వుతో మొదలైన మన స్నేహం మాటల అలల్లో చిక్కి స్నేహపు చివరన ప్రేమ చిగురించి జలతారు వెన్నెల కురుస్తున్న సమయాన మల్లెల  మాలికల సాక్షిగా వీచే గాలి తడారిపోయింది చెదురు మదురుగా ఓ మోస్తరు ప్రేమను నాపై నటించి ఆపై వెడలి పోయావు ఇన్నేళ్ళు నే వేచి చూసింది ఇలాంటి ప్రేమకోసమా గుండె అలవాటుగా  కొట్టుకోవటం  మాని లయ తప్పింది, నా ఊపిరి లో నీ ప్రేమను నింపి యినేళ్ళు  బ్రతికించింది నా మనసు గాయపరిచావు అయిన  నాకు నీపైన మచ్చుకైన కోపం లేదు సుమీ ఉన్నతమైన ప్రేమ తప్ప నీ ఆ ప్రేమని నువ్వు సంద్రం లో ముంచేశావు, మబ్బులై వాన చినుకులై స్వాతి ముత్యమై మెరిసావు నిండ

Happy Friendship Day

Image
స్నేహం అంటే ప్రాణం లేని బంధం కాదు నీ నా మధ్య వెలిసిన అనురాగ వారధి నీ నా నడుమ నిలిచే కలకాల పెన్నిధి నీ నా మన వాత్సల్యాలకు పునాది కావాలి ఈ స్నేహం ఎన్నో తరాలకు నాంది స్నేహితుల రోజు పురస్కరించుకుని నేడు మన మధ్య మన తోడూ నీడగా నిలిచే ప్రతి స్నేహితుడు/స్నేహితురాలికి స్నేహితుల దినోత్సవ శుభాభినందనలు हमारे जिंदगी में पहले बार जब तुम मिले तो मन खिल उठा एक साथी जो हमे और हमारे सपने समझ पाए एक साथी जो हर समय हमारा साथ न छोड़े एक अनोखा स्नेह बंधन जो बंधा है हमारे बीच रहे ये बर्खारार  सालों साल बिना किसी हिचक के स्नेह दिनोत्सव के शुभ अवसर पर, अपने सारे दोस्त जिन्होंने अब तक और आगे भी अपनी उस अनोखा बंधन बाँध रखा है, उन सब को हार्दिक शुभकामनाएं Friends are those who help one in need Friends are those who try to be with you Friends are those who encourage you Friends are the positive energy of any society Friends are the strength and are supporters I wish all my dearest friends, A very happy friendship day, on the occasion of Friendship Day and Hope the friendship continues ev

ఏకాకి

Image
Image Courtesy: Worth1000.com ప్రేమించలేని మనసు ఇలానే ఉంటుంది అన్ని ఉన్న లేనట్టుగా అనిపిస్తుంటది వానలేని మేఘం ఇలానే ఉంటుంది, కారిపోయిన కన్నీటి చుక్కలా చినుకులు రాల్చుతూ కరుణలేని హృదయం ఇలానే  ఉంటుంది, మనసు లేని మనిషిలా జాబిలీ లేని రేయి ఇలానే ఉంటుంది, కాటుక కన్నుల్లో నల్లని రంగులా తంతిలేని వీణ పలుకనేల రాగాలు మీటిన రాలవు భావాలు రంద్రం లేని మురళిని ఎంత ఊదిన ఏమి లాభం, రాగం పలుకలేని వెదురు చెక్క మిగిలెను ఓ పక్క అన్ని ఉంటె సరిపోదు ఈ లోకాన మనిషనే వాడికి మిగితా జంతువులకి ఉన్న తేడల్లా ఒకటే మనిషి అర్ధం చేసుకుని మసులు కుంటాడు లేనిచో ఇలాటి పూర్తికాని లోకం లో ఏకాకిగా మిగిలిపోతాడు  

నిదురించే కన్నుల...

నిదురించే కన్నుల మాటున రగిలే ఆవేదనను చల్లర్చుతుంది  కమ్మటి కలా వింతలూ వినుత్నాలు కోసమేగే కనుబొమ్మల కదలికకు  పోస్తుంది ఓ హాయి అలా చీకటికి వేకువకి మధ్య నిచ్చెన వేసి జలతారు వెన్నెల దివిలో నీ ఊహాలోకం లో తెలిపోకలా పగలు వగలకు వన్నె చేకూరుస్తుంది అదిగో ఆ హరివిల్లు తళుకుబెళుకు తో ఇలా భావాన్ని మనసులో బంధించగలమా లేదు ఎన్నటికి అలా జరగదు సుమా ఏ కాలమైన తరిగిపోని భాష ప్రాబల్యత నేడు అయ్యెను చూడు ప్రాణాలత 

హరి ఓం నారాయణ

అది నైమిశారణ్యం. ఆ అరణ్యం లో సర్వకాల సర్వావస్థలందు సత్సంగం సాగుతూ ఉంటుంది. ఆ సత్సంగానికి సూతుడు నాయకుదు. అతడే వక్త. శౌనకాదులు శ్రొతలు. ఈ సత్సంగంలో అనేక దివ్యక్షేత్రాల ప్రసక్తి ,దెవాధిదెవతల లీలలు కథరుపంలో సూతుడు  శౌనకాదులకు విన్నవించటం పరిపాటి. ఒకనాడు శౌనకాదులు సూతుణ్ణి చూచి "షడ్గుణాడ్య ! నారాయణస్వరూపుడైన వేదవ్యాసుని సత్కృపతో సర్వస్వము తెలిసిన మహానుభావుడివి. త్రిమూర్తులలో హరి శ్రేష్ఠుడు కదా! ఆ హరికి అండ పిండ బ్రహ్మాండాది లోకాలలో ఏది ప్రియస్థలము? ఎక్కడ హరి స్వయంవక్తుడిగా ప్రకాశిస్తూన్నాడు? సామాన్య మానవులు కూడా దర్శించగల క్షేత్రం ఏది? మాకు తెలియజేయగలరు" అని ప్రార్థించారు. సూతుడు శౌనకాదుల ప్రశ్నను, ఆకాంక్షను మేళవించుకుని స్థిమితకాలము ధ్యానలోచనుడై సమాధిలో మునిగి తదనంతరము శౌనకాదులను చూచి విశదంగా వివరించగలను అని బదులిచ్చాడు.   ఒకప్పుడు సమస్తము లయమైపోయింది. మహావిష్ణువు వటపత్ర శయనుడైనాడు. కాలం గడచింది. శ్వేతవరాహరూపం ధరించి జలంలోనికి ప్రవేశించాడు. పాతాళంలో దాగిన రుక్మాక్షునితో సమరం సాగించి అతనిని సంహరించాడు. పాతాళం లో ప్రవేశించి కోరలతో 'భూమి'ని ఉద్ధరించాడు. అపుడు బ్రహ్మాది