Posts

Summer

మండే ఎండలు చివుక్కు చివుక్కు మనినా గొంతుక ఎండుతూ దాహం దాహమనినా నిప్పుల కుంపటిని సూర్యుడు నడినెత్తిపై బొర్లించినా వేసవి తాపం మండుటెండలో ముచ్చమటలు పట్టించినా వేడిమి నుండి ఉపశమనానికి గొడుగును వాడినా వాతానుకులిత ఉపకరణాన్ని గంటల తరబడి 'ఆన్' చేసి ఉంచినా వేడి తాకిడికి బొగ్గు గనుల్లో మంటలు ఎగిసిపడినా ఎగసిపడే మంటలమాటున బొగ్గు మసి బొగ్గుపులుసు వాయువై నింగికెగిసినా నీరు ఆవిరైపోయి విద్యుత్ నిలిచిపోయినా గ్రీష్మానికి ఆదరణ తగ్గెనా? Written as Summer has arrived

ఎలక్షన్

Image
ఎలక్షన్లు ఎలక్షన్లు భావి భారతావని ప్రగాతికిదే తోలి మెట్టు ఎలక్షన్లు ఎలక్షన్లు కుళ్ళు కుతంత్రాలన్ని ఇక పక్కనబెట్టు  ఎలక్షన్లు ఎలక్షన్లు పరిగెత్తుకు రా వోటాయుధం చేత బట్టు  ఎలక్షన్లు ఎలక్షన్లు మాయమాటల మోసాల పనిపట్టు ఎలక్షన్లు ఎలక్షన్లు వోటు వేసి నీ ఖ్యాతిని సమాజం లో నిలబెట్టు  ఎలక్షన్లు ఎలక్షన్లు నీకు నచ్చినట్టు నచ్చిన వారికే పదవిని కట్టబెట్టు  ఎలక్షన్లు ఎలక్షన్లు వోటు మీట నొక్కి భారతావనికి సలాం కొట్టు  ఎలక్షన్లు ఎలక్షన్లు రాజకీయ మార్పునకు నాంది పలుకుతూ వోటు వేసి ఆదరగొట్టు  

శ్రీ జయ నామ ఉగాది శుభాకాంక్షలు

మన పెరట్లోని మామిడి కాయల వగరు మనలోని బాధను మన నుండి వేరు చెయ్యాలి ఆ చేదు  వేప పువ్వులు మనలోని చెడు గుణాన్ని పారద్రోలాలి ఆ తీపి అరటి బెల్లం పాకం మన జీవితాల్లో మంచిని పంచాలి తీపి కారం చేదు  వగరు పులుపు ఉప్ప: అన్ని కలగలిపి జీవితానికే తలమానికగా నిలవాలి నా స్నేహితులకు, సన్నిహితులకు, గూగుల్ ప్లస్ వీక్షకులకు, నా బ్లాగ్ పాఠకులకు కావ్యాంజలి బ్లాగ్ తరపునుండి శ్రీ జయ నామ ఉగాది శుభాకాంక్షలు ఇట్లు, మీ శ్రీధర్ భూక్యా  

చూడు

దుఃఖం బంధించిన పెదవులపై చెరిగిపోని చిరునవ్వు సంతకాన్ని చేసి చూడు  , ఆ నవ్వు ప్రవాహానికి దుఃఖమే కొట్టుకుపోతుంది  లోకమే కొత్తగా కనిపిస్తుంది    బాధతో నిట్టుర్చుతూ రాల్చే కన్నీటిని అధిగమించి తల పైకెత్తి చూడు, ఆ చూపులకే బెదిరిపోయి బాధనేదే లేకుండా చెల్లా చెడురై పోతుంది ఉద్వేగం తో లయతప్పిన హృదయ కవాటాల్లో ప్రేమను సంతోషాన్ని నింపి చూడు, తన్మయత్వం తో లయబద్దమైన ఊయలలుగుతూ ఉప్పొంగిపోతుంది  వేదన అనే కల్మషాన్ని నీ జీవితం నుండి పారద్రోలి చూడు, నిన్నటి దాక  నీది కాదనుకున్న జీవితమే నీకు కొత్త దారులు చూపుతుంది 

పడవ

నేను ఓ నావ తయారు చేసాను, దానిని స్నేహపు నావ అని పేరు పెట్టాను సమాజం అనే సంద్రం లో, లోకులనే అలలపై నా నావను నడిపించే ప్రయత్నం ఓ స్నేహం చెయ్యి చాచి పిలిచింది, పదునాలుగేళ్ళ క్రితం దానికి ఆటుపోట్ల ప్రేమ సునామి వచ్చి ఖంగు తిని పదవ ను మరల ఒడ్డుకి చేర్చాను ఇంకో స్నేహం ఎదురయ్యింది, కళ్ళముందు కదలాడే మరపడవను తలపిస్తూ నన్నే అందులో రమ్మని ప్రాదేయపడింది, స్నేహానికి వెలకట్టలేని నేను సరేనన్నాను నడి సంద్రానికి చేరుకున్నాక ఆ పడవకు రంద్రం ఏర్పడి నీళ్ళు లోనికి రా సాగాయి ఒకడు స్నేహం అని వాదిస్తే ప్రేమ అన్నారు, ఇలా కాదని ఆ 'జన' సంద్రాన్ని ఈదుకుని ఒడ్డుకు చేరుకున్నాను నా పడవ  ఆ ఒడ్డున లేదు, దానిని ఎవరో ఎత్తుకు పోయారు స్నేహానికి విలువలేదని ఆకర్షణే ప్రేమ అని అనుకుని వెళ్తున్న నాకు నా పడవ  ఇసుక లో కూరుకుపోయి కనిపించింది స్నేహాన్ని మించి  ఆకర్షణ , ఆకర్షణ ను మరిపించే ప్రేమలు కూడా ఉంటాయని అమ్మ ప్రేమే అందుకు సాక్షమని తెలిసి మనసు తేలిక పడింది

వడగళ్ళు- వడగాల్పులు

రెక్కలు కట్టుకు ఎగిరే పక్షికి ఆకాశమే హద్దు గాలికి పోటి పడి కురిసే వానకు కాలగమనమె హద్దు  మితి మీరడం ప్రకృతి మనకు నేర్పించకపోయిన మనిషి ఆలోచనలను  చిందర వందర చేసి పుట్టే చెడుకు ఆనవాళ్ళు  కరిగిపోయే హిమపాతమే వడగళ్ళై కురిసే తీరు చలిని చంపే సూర్య రాష్మే వదగాల్పులై శక్తినంత పీల్చుకునే తీరు  బంధాల బాంధవ్యాల నడుమ బంధానికి బాంధవ్యానికి తేడా తెలియని మూర్ఖులు కొందరు  ఆహ్లాదం కోరుకునే మనసుని విరిచి శునకానందం పొందేది మరి కొందరు  (ఈ కవితలో వాడిన భాష కాస్త కటువుగా ఉన్నా, ఎవరిని ఉద్దేశించి వ్రాసినది కాదని తెలియపరుచుకుంటున్నాను)

ఇంటర్నేషనల్ విమెన్'స్ డే

ఒకరి కల్పవల్లి ఒకరి నిత్యాలంకారి ఒకరి మనసులో నిక్షిప్తమైన  భరిణ, ఒక అమ్మ ఒక చెల్లి ఒక భార్య  కాని ఎక్కడ చూసిన మగువ తన ఉనికిని మనకు తెలుపుతూనే ఉంది  అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత వీర వనీతలందరికి,  నేటి మేటి యువరాణులకి, నవయుగపు మహిళమణులకు  కావ్యాంజలి బ్లాగ్ తరుపునుండి నా శుభాభినందనలు