పడవ

నేను ఓ నావ తయారు చేసాను, దానిని స్నేహపు నావ అని పేరు పెట్టాను
సమాజం అనే సంద్రం లో, లోకులనే అలలపై నా నావను నడిపించే ప్రయత్నం

ఓ స్నేహం చెయ్యి చాచి పిలిచింది, పదునాలుగేళ్ళ క్రితం
దానికి ఆటుపోట్ల ప్రేమ సునామి వచ్చి ఖంగు తిని పదవ ను మరల ఒడ్డుకి చేర్చాను

ఇంకో స్నేహం ఎదురయ్యింది, కళ్ళముందు కదలాడే మరపడవను తలపిస్తూ
నన్నే అందులో రమ్మని ప్రాదేయపడింది, స్నేహానికి వెలకట్టలేని నేను సరేనన్నాను

నడి సంద్రానికి చేరుకున్నాక ఆ పడవకు రంద్రం ఏర్పడి నీళ్ళు లోనికి రా సాగాయి
ఒకడు స్నేహం అని వాదిస్తే ప్రేమ అన్నారు, ఇలా కాదని ఆ 'జన' సంద్రాన్ని ఈదుకుని ఒడ్డుకు చేరుకున్నాను

నా పడవ  ఆ ఒడ్డున లేదు, దానిని ఎవరో ఎత్తుకు పోయారు
స్నేహానికి విలువలేదని ఆకర్షణే ప్రేమ అని అనుకుని వెళ్తున్న నాకు నా పడవ  ఇసుక లో కూరుకుపోయి కనిపించింది

స్నేహాన్ని మించి  ఆకర్షణ , ఆకర్షణ ను మరిపించే ప్రేమలు కూడా ఉంటాయని
అమ్మ ప్రేమే అందుకు సాక్షమని తెలిసి మనసు తేలిక పడింది

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల