చూడు
దుఃఖం బంధించిన పెదవులపై చెరిగిపోని చిరునవ్వు సంతకాన్ని చేసి చూడు ,
ఆ నవ్వు ప్రవాహానికి దుఃఖమే కొట్టుకుపోతుంది లోకమే కొత్తగా కనిపిస్తుంది
బాధతో నిట్టుర్చుతూ రాల్చే కన్నీటిని అధిగమించి తల పైకెత్తి చూడు,
ఆ చూపులకే బెదిరిపోయి బాధనేదే లేకుండా చెల్లా చెడురై పోతుంది
ఉద్వేగం తో లయతప్పిన హృదయ కవాటాల్లో ప్రేమను సంతోషాన్ని నింపి చూడు,
తన్మయత్వం తో లయబద్దమైన ఊయలలుగుతూ ఉప్పొంగిపోతుంది
వేదన అనే కల్మషాన్ని నీ జీవితం నుండి పారద్రోలి చూడు,
నిన్నటి దాక నీది కాదనుకున్న జీవితమే నీకు కొత్త దారులు చూపుతుంది