అలుపెరగని బాటసారి

జీవితపు ప్రతి ఘడియ ఓ మైలురాయే, ఎన్ని దాటినా మనముందు మున్ముందు అలాంటివి ఎన్నో మరెన్నో 
వాటిని అధిగమించి  దూసుకు వెళ్లాలే తప్ప వెనుదిరిగి మనః సాక్షి ముందు దోషిగా నిలబడకు ఏనాడు ఓ బాటసారి 

నీ ప్రతి అడుగులో తెలిసి తెలియని అలజడులేమైన ఉన్నా, రెప్ప మూసి తెరిచేలోపు కన్నీరు ఏరులై పారినా 
కస్తాల కడలి దాటకుండా నీ మజిలికి నువ్వు చేరలేవు, అన్ని ఋతువులు కలగల్పితే ప్రకృతి అవుతుందని మర్చిపోకు ఓ బాటసారి

నిస్సహాయత నిన్ను తన వాకిలి ముందు నిలువర్చిన, మనోబలం తో ఆ జిగటను వదిలించుకుని వడివడిగా అడుగులలో అడుగులేస్తూ సాగిపో ఓ దీశాలివై, వ్యాకులతకు చరమగీతం పాడి నవలోకం నీ కళ్ళ ముందు నిన్ను ఆహ్వానించేలా ఓ బాటసారి 

Popular Posts