కంప్యూటర్ + ఆధునికికరణ = కంప్యూటరికరణ
Image Courtesy: Wikipedia |
Samsung Galaxy Gear Fit |
ఔరా ఏమి ఈ వింత:
అలనాడు కాలు కూడా మోపలేని విధముగా ఓ పెద్ద గదిలో వైర్లు ఒకదానిమీద మరొకటి పెనవేసుకుని
చాంతాడంత మల్లెల మాలికల మీటలు బీటల్ల చప్పుళ్ళు చేసే పరికరాలు ఉండేవట
అది కాస్త మెల్లిమెల్లిగా గది మొత్తాన్ని వీడి గదికి ఓ మూల ఉండే పెద్ద పరికరం అయ్యింది
మీటలు నొక్కితే ఒకట్లు సున్నాలే ముత్యాల హారాల్ల నల్లని స్క్రీన్ పై తెల్లటి అక్షరాలూ పెనవేసుకున్నాయి
ఆకారం తగ్గి బక్క చిక్కి ఓ పక్కగా రంగులదుముకుని మన ముందుకు ముస్తాబై వచ్చింది
అక్షరాలూ బొమ్మలు గీసుకునే 'ఎలుక'ను తన తో తీసుకు వచ్చింది మన ముందుకు
వాక్యూం ట్యూబ్లు కాస్త గోర్డాన్ మూర్ లా వలన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అయ్యాయి
అన్ని తమలో దాచుకుని సకలం నేనే అని చెప్పాయి, గిర గిర తిరిగే పళ్ళాని డేటా సేవ్ చేసుకునే ప్లాటర్ హార్డ్ డిస్క్ అయ్యి
వినూత్నంగా వాటిని తలదన్నే లాగ సిమోస్ నాండ్ ఫ్లాష్ మెమోరీస్ వచ్చి కాస్త ఆ మూలనున్న పరికరాన్ని వొళ్ళో పెట్టుకునేల మనతో పాటు ఎక్కడికైనా తోడుగా తీసుకెళ్లేలా ఆవిర్భవించింది
అక్కడితో ఆగకా దూరభాషిణి లో నిక్షిప్తమయ్యింది, గొంతుక వినిపించడం తప్ప మరేది కనిపించని లోకాన్ని మెల్లిగా కళ్ళ ముందు ఒకరినొకరు పరిచయం చేసుకునే వీలు గా ఆవిష్కృతం అయ్యింది
గదినంత ఆవహించిన ఆ మరబొమ్మ నేడు మణికట్టు మీద అమరి స్మార్ట్ వాచ్ అయ్యి, మొబైల్ ఫోన్ మాదిరి మారి పోయింది
దూరాల తీరాలు మాటల్లో ఎంతో దూరమైనా, ఒకరినొకరు పలకరించే ఈ గూగుల్ ఆండ్రాయిడ్ /విండోస్ ఫోన్ /ఐ ఓఎస్/బ్లాక్బెర్రీ ఓఎస్/ పుణ్యమా అని లోకాన్నే తనలో బంధించి మాయ అంతర్జాలిక పటిమ ను మనముందు మన ముందు తరాలకు మునుముందు ఆదర్శమై నిలువనుంది