వడగళ్ళు- వడగాల్పులు
రెక్కలు కట్టుకు ఎగిరే పక్షికి ఆకాశమే హద్దు
గాలికి పోటి పడి కురిసే వానకు కాలగమనమె హద్దు
మితి మీరడం ప్రకృతి మనకు నేర్పించకపోయిన మనిషి ఆలోచనలను
చిందర వందర చేసి పుట్టే చెడుకు ఆనవాళ్ళు
కరిగిపోయే హిమపాతమే వడగళ్ళై కురిసే తీరు
చలిని చంపే సూర్య రాష్మే వదగాల్పులై శక్తినంత పీల్చుకునే తీరు
బంధాల బాంధవ్యాల నడుమ బంధానికి బాంధవ్యానికి తేడా తెలియని మూర్ఖులు కొందరు
ఆహ్లాదం కోరుకునే మనసుని విరిచి శునకానందం పొందేది మరి కొందరు
(ఈ కవితలో వాడిన భాష కాస్త కటువుగా ఉన్నా, ఎవరిని ఉద్దేశించి వ్రాసినది కాదని తెలియపరుచుకుంటున్నాను)