Posts

కురిసే మేఘం

Image
Image Courtesy: Flickr చిరు చినుకుల  సాయంత్రం  దోసిలిలో ఒక్కో ముత్యాన్ని పడుతూ  నిలువునా తడుస్తూ ఆ తుప్పరలో నన్ను నేనే మరిచిపోతూ  పరిగెత్తుకుని వెళ్లి నీటిమీద పడవలు చేసి పారించాను  నీలి మేఘాల సవ్వడిలో  మెరుపుతీగలా హొయలుబొతు  ఆ చిరు చినుకుల వరదలే అనుపమానంగా  ఎగసే అలలై ముచ్చాతగోలిపాయి నా నందనవనాన్నే చక్కగా అలంకరించాయి  చల్లని గాలి చెవులలో చేరి శంఖము పూరించినా  ఆ తెలియని హాయేదో నా లోలోపలా కదలాడింది  నీలి నయనాలలో ఏదో తెలియని వెఱ్రితనం నన్ను ఓ చోట నిలవనీకా  గాలిలా చినుకుల్లో తడపసాగింది నిండు కుండలో గోదారిని పట్టి నెత్తిన బోర్లించినట్టు  

పెళ్ళి

Image
Indicative Image Only ఒకె లగ్నం లో ఇరు మనసులని మూడు ముళ్ళ బంధంతో నాలుగు వేదాల మంత్రోపచారణతో పంచ భూతాల సాక్షిగా ఆరు ఋతువుల్లో కలిసిమెలసి ఉండాలని సప్తపదులు వెంట నడయాడగ అష్టైశ్వర్యాలు సిద్ధించాలని నవరసాలు తమ సంసారం లో నిండాలని పది కాలాల పాటు కష్ట సుఖాలు పంచుకునె బంధమే పెళ్ళి

చిట్టి కవిత

​ఉషోదయాలకు నాంది పలుకుతూ  పూల పరిమళాలతో స్వాగతించిన  సుమనోహర సుమమాలికల సరాగం.  చెంతన వాలే ఋతురాగాల సమ్మేళనం.  విపంచి గీతికల భావ గీతం ఎన్నో ప్రకృతిలో  ఇమిడిన అందాలు ఎన్నో ఎన్నెన్నో. ​రెక్కలు తొడిగి ఆకాశానా రివ్వున ఎగరాలనుంది.

అమ్మ ఓ భావగీతం

అమ్మ ఓ భావగీతం ఓ అనురాగానికి నిలువెత్తు రూపం అమ్మ మురిపాలలో తడిసి ముద్దవని పసి కూన లేనే లేదు అమ్మ వొడిలో ఆడుకునే బుజ్జిపాపయిల నుండి ప్రేమను పంచె రుణానుబంధం అమ్మను మించి మరేది లేదు లోకాన కనుకనే అమ్మకు జోహార్లు (మదర్'స డే సందర్భంగా )

ఇదండీ అసలు విషయం

ఏమిటి ఇవాళ్ళ కవితకు బదులుగా శ్రీధర్ ఇంకేదో వ్యాసం రాశాడేంటి అనుకుంటే దానికి కారణం ఇలా : జనవరి లో ఓ సెమి ఫినిష్డ్ ఇంటిని (అప్పటికి ఇటుకలు పెర్చుతున్నారు , స్లాబ్ పిల్లర్లు వేసి ఉన్నారు ) కొన్నాం, తీర దాన్ని మా సొంత ఊరిలో కొనడము, మేము అక్కడికి 600 కి మీ దూరం లో ఉండడం వలన హౌసింగ్ లోన్ కోసమని ఫెబ్రువారి నేలంతా డాక్యుమెంటేషన్ కె  సరిపోయింది. నాన్న నేను అమ్మ ఆ నేలంతా బ్యాంకు వెంట తిరగడం తోనే సరిపోయింది. మార్చ్ లో లోన్ సాంక్షన్ అయ్యిందని చెబితే వెళ్లి బిల్డర్ గారికి కొంత సొమ్ము  అప్పజెప్పి, ఇంటి పనులు దగ్గరుండి చక్కబెట్టేటందుకే సరిపోయింది. ఏప్రిల్ లో తిరిగి ఊరు వెళ్లి, పెయింట్ సంగతి, మిగిలిన కన్స్ట్రక్షన్ పనులకోసం ఐపోయింది ఏప్రిల్ లో బ్యాంకు కు లోన్ లో ఐదో వంతు ఈ ఎమ్ ఐ కట్టిన తరువాత రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాము. రిజిస్ట్రేషన్ ఐన పిమ్మట ఏప్రిల్ 22 న మా కొత్తింటి గృహప్రవేశం జరిగింది. ఆ తరువాత అక్కడికి మకాం మార్చడానికి ఇంకా ఓ పదేళ్ళు ఉన్నాయని ఆ ఇంటిని బాడుగ ఇచ్చి వచ్చేసరికి మే 02 అయ్యింది. ఇదండీ అసలు సంగతి. కనుకనే ఈ మధ్య కావ్యాంజలి లో టపాల సంఖ్యా కాస్త తగ్గుముఖం పట్టాయి.   

Summer

మండే ఎండలు చివుక్కు చివుక్కు మనినా గొంతుక ఎండుతూ దాహం దాహమనినా నిప్పుల కుంపటిని సూర్యుడు నడినెత్తిపై బొర్లించినా వేసవి తాపం మండుటెండలో ముచ్చమటలు పట్టించినా వేడిమి నుండి ఉపశమనానికి గొడుగును వాడినా వాతానుకులిత ఉపకరణాన్ని గంటల తరబడి 'ఆన్' చేసి ఉంచినా వేడి తాకిడికి బొగ్గు గనుల్లో మంటలు ఎగిసిపడినా ఎగసిపడే మంటలమాటున బొగ్గు మసి బొగ్గుపులుసు వాయువై నింగికెగిసినా నీరు ఆవిరైపోయి విద్యుత్ నిలిచిపోయినా గ్రీష్మానికి ఆదరణ తగ్గెనా? Written as Summer has arrived

ఎలక్షన్

Image
ఎలక్షన్లు ఎలక్షన్లు భావి భారతావని ప్రగాతికిదే తోలి మెట్టు ఎలక్షన్లు ఎలక్షన్లు కుళ్ళు కుతంత్రాలన్ని ఇక పక్కనబెట్టు  ఎలక్షన్లు ఎలక్షన్లు పరిగెత్తుకు రా వోటాయుధం చేత బట్టు  ఎలక్షన్లు ఎలక్షన్లు మాయమాటల మోసాల పనిపట్టు ఎలక్షన్లు ఎలక్షన్లు వోటు వేసి నీ ఖ్యాతిని సమాజం లో నిలబెట్టు  ఎలక్షన్లు ఎలక్షన్లు నీకు నచ్చినట్టు నచ్చిన వారికే పదవిని కట్టబెట్టు  ఎలక్షన్లు ఎలక్షన్లు వోటు మీట నొక్కి భారతావనికి సలాం కొట్టు  ఎలక్షన్లు ఎలక్షన్లు రాజకీయ మార్పునకు నాంది పలుకుతూ వోటు వేసి ఆదరగొట్టు