Posts

ఒక (అ)భాగ్యుడి (క)వ్యథ

అనుమానాలు అవమానాలకి అపవాదులకి అపార్దాలకి దారి తీస్తాయి అటువంటప్పుడు నమ్మిక, విధేయత, విశ్వసనీయత, నిరాడంబరత, నిబద్ధత లన్ని బుగ్గిపాలే కనుకనే ఆచరణీయ యోగ్యత గలగిన మంచికే మొగ్గు చూపించాలి. హరిః ఓం గోవింద మాధవాయ

ಧರ್ಮಪತ್ನಿ

నీకు స్నేహితులు లేకపోతే నాకు ఉండకూడదా అంటు నిలదీస్తున్నావు కదా.. నీకు ఏదైనా అవసరం వచ్చినపుడో లేదా సుస్తి చేసినపుడో ముందుగా నిను కాపాడుకోవాలని తపించేది నీ భర్త నైన నేను, నీ అత్త మామలు. నిన్ను కన్నవారు, నీ తోబుట్టువులు నీ పెళ్ళి అయ్యాక చుట్టాలుగానే ఉంటారు.. తమ ఇంటి బిడ్డ అత్తారింట క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. స్నేహితులు ఒక స్థాయి దాటిన తర్వాత ఏ అవసరమొచ్చినా, ఎలాంటి సాయానికి అర్థించినా "ఔనా! అయ్యో!!" అంటు నిటూర్చే వారే తప్పితే వారికి అంతకు మించిన వ్యవహారాలతో ప్రయోజనాలుండవు. మహా ఐతే సలహాలు, సూచనలు ఇవ్వగలరే కాని నీ వారిలా నిన్ను ఆదుకోలేరు. స్నేహం ఉండాలి కాని మరీ మితీ మీర కూడదు. స్నేహాన్ని అదనుగా మలచి మోసాలు చేసే వారు లేకపోలేదు. స్నేహం పేరిట డబ్బులకు పూచికత్తుగా హామి పత్రాలతో వంచన చేసి పరారై ఇరకాటంలో నెట్టిన వారు లేకపోలేదు. కన్నందుకు తల్లిదండ్రులకు, వారింట పుణ్యస్త్రీ గా కాలుమోపినందుకు అత్తారింటికి, తనకు జీవిత భాగస్వామిగా మెలుగుతున్నందుకు భర్తకు విధేయత ఒక పుణ్య స్త్రీగా తన ధర్మం. ఎంతటి దుర్భర పరిస్థితులలో నైనా ఓకరికొకరు అన్యోన్యతను, ఆత్మీయతను వీడని వారే పుణ్య దంపతులు. కళ్యాణంలో ఒక

04 May 2019

బెజవాడ కనకదుర్గాదేవి రియాలిస్టిక్ క్రియేషన్స్ భూక్యా "ధరణి" ఫ్యామిలి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ "ప్రాజెక్ట్ ౧" _ శరణ్య _ రిలీజ్: మే ౦౪ ౨౦౧౯ రన్నింగ్ సక్సెస్‌ఫుల్లి

కొరోనా సిన్స్ మార్చి ట్వెంటి ఫోర్ ౨౦౨౦ ఆన్ వర్డ్స్

కంటికి కానరాని బూచి ఏదో దోబూచూలాడుతోంది తుమ్మినా దగ్గినా ముట్టినా మొట్టినా మాట వినని మోండిది దేశాటనమంటు బయలుదేరి కుప్పతెప్పలుగా ఈ అణువంతది చివరాఖరునా మ్యాస్క్ యాప్రన్ సామాజిక దూరాల షర్తులతో ఎక్కడివారక్కడే ఎవరికివారై గప్ చుప్ ఉండమంటోంది లేని యేడల మహమ్మారియై కాటు వేయగా నిర్దయ చూపే కోరలు లేని కొరోనా రక్కసొకటి లాక్ డౌన్ తో సతమతమౌతూనే ఆరోగ్యానికై సమాయత్తమౌతు జన సంద్రం

వ్యత్యాసమిదేనా

మీ స్థాయి తెలిసి కూడా నీ గుణం గాఁచి పెళ్ళి చేసుకున్నా మీ వాళ్ళు కేవలం నా వెనుకనున్న ఆస్తి చూసి నిన్ను ఎరగా వేశారని తెలుసుకోలేక పోతున్నావ్ ఐనా జీలకర్ర మెంతులు లాటి దినుసులనే కొనుగోలు చేయగలిగే కుటుంబంలో పుట్టిన నాకు బుడ్వీజర్ బ్లాక్ డాగ్ కొని తాగి తూగే కుటుంబంలో పుట్టిన నీకు బహుశ ఇదే వ్యత్యాసమేమో బాడుగ ఇంటిలో అపుడపుడు ఎగవేతలు కోతలతో సతమతమవ్వుతూనే ఇతరులను హేళన చేసేవారు కష్టార్జితంతో సొంతిల్లు నిర్మించి వేరొకరికి బాడుగకు ఇస్తే రూపాయి కూడా అందులో పెట్టుబడి లేని మీకు మాపై కసురుకూనే హక్కు ఇచ్చిందెవరు ఐనా కందులు మినుములు లాటి నిత్యవసరాలనే కొనుగోలు చేయగలిగే కుటుంబంలో పుట్టిన నాకు ఆఫిసర్స్ చాయిస్ సిగ్నేచర్ కొని తాగి తూగే కుటుంబంలో పుట్టిన నీకు బహుశ ఇదే వ్యత్యాసమేమో పాతిక లక్షల సరిసమానంగా కట్న కానుకలు ఇచ్చి కూతూరి వివాహం చేయాలనుకూని కోరుకున్న వాడిని కట్టుకూని అరవై మూడు లక్షల నగదును ఒక్క దఫాలో ఇచ్చి సాగనంపారు కట్నం ఊసెత్తకుండా వివాహం చేసుకుందామనుకూనే తరుణంలో మేమేమి తక్కువ కాదని కలుగచేసుకుని మరీ పన్నెండు లక్షలు ఇస్తామని రెండు లక్షల ఎనభై వేలకు సరితూగే బంగారు నగలు కొని సర్దిచెప్పుకున్నా

పీడ కలలా..

ఎవరో చేసిన పనికి తలవంపులెందులకు వారిరువురికి సమ్మతమట మనకెందులకు తర్జన భర్జన పడుతోందా మనసు అడుగెందుకు మాయ విశ్వం ఇందలి సూక్ష్మం గ్రహించేందుకు మధన పడరాదు దిక్కులన్ని పెక్కటిల్లెటందుకా శిరోభారమై కంటతడిని సైతం చూసి చలించేటందుకా దాటి పోయింది చేయి వాత్సల్యానికే కాలం చెల్లిపోయింది కనుకనే కనికరం లేకుండ మమ్మొదిలి వాడితో జతగా పిన్న చెల్లి వెళ్ళిపోయింది

ఋణం~ దారుణం

లోకం తీరు చేదు నిజం "వారిరువురు రెండు నెలల వ్యవధిలో స్వలాభాపేక్ష తో నటించి ఏడు పదుల శత సహస్రాలను మూటగట్టుకున్నారు." "ఇతనొకరు స్వార్థరహితంగ రేయిఁబవళ్ళు కష్టార్జించి పైసా పైసా కూడబెట్టుకున్నారు." "వారిరువురు కైకేయి మనస్తత్వంతో వీరి ఒక్కగానొక పుత్రుణ్ణే వీరి నుండి దూరం చేసే పన్నాగం రచించారు." "ఇతనొకరే కుటుంబమంత కలిసిమెలసి ఉండాలనే భావనను ఇన్నేళ్ళుగా నిలబెడుతు వస్తున్నారు." "మంథర వాదమో కైకేయి పంథమో రాముడిని అయోద్య నుండి పదునాలుగేళ్ళు దూరం చేశారు." "మాయలేడి ఇంద్రజాలమో శూపనఖ కనికట్టో ఆనాడు రాముడిని సీతను వేరు చేశారు." "ఇన్నాళుగా తనపై ఉన్న వాత్సల్యతను వీరిరువురి స్వార్థంతో జీవితాంతం దోషిలా నిలబెట్టాలనే పన్నాగం పన్నీనారు." "వారికి రావలసిన మొత్తాన్ని వీలైనంత తక్కువ సమయంలో చేజిక్కించుకున్నారు." "అన్ని ఉండి కూడా కన్నవారి ఆదరణను నోచుకోనీకుండ అయోమయంలో నెట్టేశారు."