నీ జ్ఞాపకాలను తలుచుకుని నా కనులు మూసి నిదుర పోయా వెన్నెల రాత్రుల్లో ఎందుకో ముచేమటలు పట్టి ఆవిరి సెగలలో ఉన్నటనిపించింది చిరుగాలులు వీస్తున్న ఆ గాలి తాకినట్టు అనిపించదేలా నిదుర లేచి అనంతాకాశం వైపు చూశా, ni momu naa kannullo పాతుకున్నట్టుంది
చల్లగా వీచే గాలుల్లో ఏదో అపశ్రుతి పెనుమంటల మాటున ఏదో తెలియని అగాధం హాయిగా మేఘాలలో తేలించి అచ్చటె నిలిపేసే హోరు గాలి దుమారం ఇదేనేమో ఆ ప్రేమ యొక్క నిజ స్వరూపం
స్నేహం: శత్రువులకి ఎప్పటికి తెలియని , తెలిసిన అర్ధం కాని వైనం ప్రేమ: కన్నులు చూడని మనసులు మాత్రమె మాట్లాడే తియ్యని భాషా జీవితం: పొందక ముందు ఉబలాటం పొందిన తరవాత చెలగాటం పెళ్లి: ఉన్నవి రెండక్షరాలు , కలిపేది రెండు మనసులు కాని చివరకు అయ్యేది ఒకటి
నిన్ను తలుచుకున్న ప్రతి సారి నా మనసెందుకో హడలి పోతోంది పరగ్గా ఉన్నపుడు కలవర పడుతూ ఉంది చిరునవ్వుల పువ్వులతో నా ప్రేమకు పూజ చేస్తావనుకుంటే ఆ పువ్వులని విసిరి కొట్టావ్ నా ప్రేమ 'సమాధి' పైన మరిచిపోదామని అనుకున్నా ప్రతి సారి గుర్తుకోచేది నువ్వే నిరాశ నిస్పృహలు మిగులుస్తావ్ క్రుంగి దీస్తావ్ చిరు పలుకుల పూల మాల అల్లావనుకున్న ఆ పూల మాలే నా ప్రేమ కి ఊరితాడవుతుందని ఊహించ లేదు ఉలికి పడి లేచి అనుక్షణం భయపడుతూ ఉన్నా నీ చూపుల వెన్నెల ధారాల్లో నా మనసు చిక్కుకుందేమో నని అనుకున్నా అవి నా ప్రేమ పై నిప్పు రవల్ల విరుచుకుంటాయని తెలుసు కోలేక పాయినా నీ ప్రేమ చలి మంట లా వెంటే ఉందనుకున్న వేసవి ఎడారి లా కక్కి బుగ్గిపాలైతాయనుకోలేదు
ఒహో ఒహో ఏమైంది నాకిలా ఏదో తెలియని భావన ల చినుకులు పడ్డ పుడమి ల పున్నమి వెన్నెలలోని చల్లని గాలి పరిమళాన్ని వెదజల్లి నట్టు ఒహో ఒహో ఏమైంది నాకిలా నా మనసెందుకో కలవర పడుతూ ఉంది కలహాలు మొహమాటాలు ఎలానో నా మనసుకి చీకటిలో చిరు దివ్వెల ల కాంతులలో ఉన్నట్టు మనసు ఊరట పడుతూ ఉంది
వేసవి మండుటెండలో మంచు ముత్యమా వణుకు చలిగాలి లో ఉదయించిన వేచనైన కిరణమా పచని చిగురాకు తొడిగిన వాసంతమ నా గుండెను పరవశం లో ముంచెత్తిన ఉల్లసమ నాడు పొందలనుకుంటీని నీ స్నేహం కాని వచ్చి పంచావు నీ స్నేహ వరం ఒ మిత్రమా చేశావ్ నా జన్మ ధన్యం తీర్చగలన నువ్వు ఇచ్చిన ఈ రుణం సేలయేరంతటి నిర్మలం నీ ఆలోచన ఆణి ముత్యమ్ కన్న మేలయినదీ నీ ప్రవర్తన అందుకే నీతో స్నేహం చెయ్యాలన్న నా తపన వేసింది మన మధ్య ఒ స్నేహ వంతెన
అసలు ఇప్పటి రాజకియానికి అప్పటి నేత్రుత్వానికి ఎక్కడ పొంతన లేదు. అప్పటి నేతలు దేశాభివ్రుద్ది గురించి ఎంతొ పాటు పడ్డారు అలనాటి పొట్టి శ్రీ రాములు టంగుటూరి ప్రకాశం పంతులు.. ఒ మహాత్మా ఒ వీర సవర్కర్ లాంటి వాళ్ళు ఇప్పుడు కరువవ్వుతున్నారు .. రాజకీయం అంటే ఇప్పటి కాలం లో కుట్ర దగా మోసం నిలువు దోపిడి రాజ్యాంగం పుటలు నేడు సగ్రహాలయాలో ఒక పురాతన వస్తువుల ఉంది . ఇప్పటి నాయకులు ఎప్పుడు నాకు ఈ పదవి వస్తుందా ఎప్పుడు నేను కోతిస్వరుడినుతాన అని తన స్వార్థనికే మొదటి స్థానం ఇస్తున్నాడు. ఇలా అప్పుడు గాంధీ గారు చేసుంటే మనకి ఈ స్వేచ్చ ఉండేదా...? ఇప్పటి కాలం లో ఎవరో వకరు ఏదో ఒక కుంభకోణం లో చెయ్యి తడిపిన వారే . ఎవరు ఎప్పుడు ఎంతః తొందరగా గద్దె దిగితే ఎక్కాలి అని చూసే వారే తప్ప . ఇక్కడ ఇప్పుడు అవసరానికి గ్రామాల్లో పల్లెల్లో తిరిగే నాయకులున్నారు వోట్లు వచ్చాక ఎవరి దారి వారిదే అన్నటు ప్రవర్తిస్తున్నారు. ఎం ఇప్పుడు గుర్తు కు రావా వాళ్ళకి వాళ్ళిచ్చిన ఆ వాగ్దానాలు..? నాయకులంటే జనాలని పట్టించుకుని వాళ్ల బాగు కోరే వాళ్ళు . కాని ఇప్పటికాలం లో వాళ్ళకి ఇవ్వడం మానేసి వాళ్ల ఇంటికెళ్ళి మెక్కి వస్తున్నారు... ఇందుకా అందరు ఎన్నుక...
పూచే ప్రతి పువ్వు వికసించదు నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు ఈ మగువలకు మన పిలుపులు వినబడవు మన మనసులు ఎవరికీ తెలియవు మన ఆరోప్రాణాలు విళ్ళే చివరికి చీదరించే వాళూ విళ్ళే ఈ మగువలకు మన పలుకులు వినబడవు మన మనసులు ఎవరికీ తెలియవు ప్రతి అందం నిన్ను కోరుకోదు నువ్వు కోరుకునే అందం దొరకదు ఈ మగువలకు మన కూతలు వినబడవు మన మనసులు ఎవరికీ తెలియవు మన మనస్తత్వాలు అర్ధం కావేవరికి అర్ధం చేసుకునే మనసు ఎవరికుంది ఈ మగువలకు మన ఆర్త నాదాలు వినబడవు మన మనసులు ఎవరికీ తెలియవు