ఎటు నీ పయనం

అసలు ఇప్పటి రాజకియానికి అప్పటి నేత్రుత్వానికి ఎక్కడ పొంతన లేదు. అప్పటి నేతలు దేశాభివ్రుద్ది గురించి ఎంతొ పాటు పడ్డారు అలనాటి పొట్టి శ్రీ రాములు టంగుటూరి ప్రకాశం పంతులు.. ఒ మహాత్మా ఒ వీర సవర్కర్ లాంటి వాళ్ళు ఇప్పుడు కరువవ్వుతున్నారు .. రాజకీయం అంటే ఇప్పటి కాలం లో కుట్ర దగా మోసం నిలువు దోపిడి రాజ్యాంగం పుటలు నేడు సగ్రహాలయాలో ఒక పురాతన వస్తువుల ఉంది .

ఇప్పటి నాయకులు ఎప్పుడు నాకు ఈ పదవి వస్తుందా ఎప్పుడు నేను కోతిస్వరుడినుతాన అని తన స్వార్థనికే మొదటి స్థానం ఇస్తున్నాడు. ఇలా అప్పుడు గాంధీ గారు చేసుంటే మనకి ఈ స్వేచ్చ ఉండేదా...? ఇప్పటి కాలం లో ఎవరో వకరు ఏదో ఒక కుంభకోణం లో చెయ్యి తడిపిన వారే . ఎవరు ఎప్పుడు ఎంతః తొందరగా గద్దె దిగితే ఎక్కాలి అని చూసే వారే తప్ప .

ఇక్కడ ఇప్పుడు అవసరానికి గ్రామాల్లో పల్లెల్లో తిరిగే నాయకులున్నారు వోట్లు వచ్చాక ఎవరి దారి వారిదే అన్నటు ప్రవర్తిస్తున్నారు. ఎం ఇప్పుడు గుర్తు కు రావా వాళ్ళకి వాళ్ళిచ్చిన ఆ వాగ్దానాలు..? నాయకులంటే జనాలని పట్టించుకుని వాళ్ల బాగు కోరే వాళ్ళు . కాని ఇప్పటికాలం లో వాళ్ళకి ఇవ్వడం మానేసి వాళ్ల ఇంటికెళ్ళి మెక్కి వస్తున్నారు... ఇందుకా అందరు ఎన్నుకునేది ...?

ఇలా ఉంటే మన భారతావని నిజాయతి కోసం విలవిల బోతోంది . సినిమా లో డైలాగ్ విన్నంత మాత్రాన ఆ క్షణం లో మనం ఆ హీరో ల ఫీల్ ఐపోతామే మరి మన అమ్మలాంటి, అమ్మ కన్న గొప్ప భూమి మీద అడుగుపెట్టి లంచాలు, నేరాలు , ఘోరాలు, కుంభకోణాలు ఎందుకు... ఇలా చేసి ఎవరిని ఉధరిద్దామని మన నాయకులూ అనుకుంటున్నారు.

ఎవరైనా కలిసిమెలసి ఉండాలని కోరుకుంటారు జనం మధ్య బంధుత్వాన్ని పంచాలని కోరుకుంటారు కాని ఎంటో ఈ విచిత్రమైన ధోరణి. మన ఆంధ్రావని కోసం పోరాటం మానేసి దానిని ఎప్పుడు రెండు గా చిల్చేద్దమ అని ఎదురు చూస్తున్నారు .. ఈ పరిస్తితి ఎలా ఉందంటే ఆకలి దాహం తో అలమటిస్తున్న ఒక మనిషి ఎవరైనా ఇంత నీళ్లు ఇస్తే గొంతు తడుపుదాం అని అనుకొని గేవ కేకలేస్తుంటే అక్కడి జనం వెన్నక్కి మరలి వెళ్లి అక్కడి రాబందులకు వదిలేసినట్టుంది అవేమో ఎప్పుడు ఈ మనిషి చస్తాడా ఎప్పుడు మేం పీక్కొని తింటామ అని ఉన్నట్టు ఉంది .

ఎవరో వస్తారని వాళ్ళు వస్తె ఏదో చేస్తారని ఈ కాలం లో అనడం బదులు అసలైన నేతలు గా మేలగండి

ఈ భారత దేశం ఇప్పుడు మన అందరిది. ఒక గింజ వేస్తే అది పది గింజలు పెట్టె అన్నపూర్ణ రా..
దేశం తో చెలగాటం వద్దు.. చేతనైతే మనసుల్ని మనషులని కలపండి వాళ్ళ ఆకలి దప్పికలను దూరం చేయ్యడానికి కృషి చెయ్యండి అప్పుడే మనం సాటి మనశుల్లో నుండి వచిన నాయకులమౌతాం

జై హింద్

Disclaimer: The Views and Objectives in this brief write up is just given here for musing only and not for making any comments and it is hereby declared that the author is not responsible for the beliefs in this write up.

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం