ఇదే నా భారతావని షష్టిపూర్తి గాథ

ఓ నా భారతావని గమనించావా ఈ కాలపు మానవాళి నీ ?

అలనాటి గాంధి గారు తెచ్చిన స్వాతంత్రానికి నేటికి షష్టిపూర్తి

కాని ఏది నా భారతావని లో మార్పు...? ఏది నా సాటి మనుషులలో చైతన్యం...?

నేరాలు ఘోరాలు జరుగుతున్నా ఎలా ఉండగాలుగుతున్నవమ్మ ఒక్క మాట పెగలక...?

నేడు ఆ మనుషులే దారుణాలు చేస్తూ ఉన్నారే... ఎక్కడమ్మా ఆ నిండు తనం

నేటి గురించి ఆలోచించి నిర్ణయాలు తీస్కోవలసిన నాయకులు మరి ఎందుకో రేపటి గురించి ఆలోచిస్తున్నారు...?

ఆకలి దప్పులు తీర్చాల్సింది పాయి ఆ డబ్బును పరదేశాలకు పంపిణి చేసేస్తున్నారు...? ఇదేనా మనం నేర్చుకోవలసిన గుణ పాఠం

కోట్లు ఉన్నవారికే కొట్లిచేస్తున్నారు... మరి మధ్యతరగతి కుటుంబాల పరిస్తితి ఏమిటి...?

అమ్మ నీపై రోజువారి దండ యాత్రలు చేసేది వేరెవ్వరు కారు సాటి నీ బిడ్డలే నమ్మ...

మనిషి మనిషికి ఎందుకు ఇంత తేడ...? ఏమి ఒరిగిందని ఈ విచిత్ర పోరు...?

ఎందుకో ఈ కుట్ర రాజకీయాలు... సమానత్వం అని పిలిచి హక్కును ఎగ మింగుతున్నారు

అలనాటి నాయకులకు ఈనాటి నాయకులకు ఎచట పొంతన లేదమ్మా

అలనాడు ప్రతి ఇంటి క్షేమ సమాచారాలు తెలుసుకునే వారు .. ఈనాడు సభ లో గందరగోళానికి తప్ప దేనికి పనికి రాకుండా పోయారమ్మ ఈ నాటి నాయకులు.

మేం లంచాలు తీస్కోమని ఉతుత్తి వాగ్దానాలు చేస్తారు.. తీర సభలో ఆ డబ్బులనే పాశం గ విసిరి బ్రతుకుతున్నరమ్మ

మానవత్వానికి గౌరవమ్ ఏనాడో చేల్లిపాయిందమ్మ లోకం లో

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల