నీరాజనం

నీలాల కనులు ఏడుస్తాయి కాని ఈ లోకం వెలుగులు చూపిస్తాయి
నీలాల కనులు ఏడుస్తాయి కాని కలలు తెప్పిస్తాయి
కన్నుల కాంతి తో ఈ లోకం లో అన్ని కనిపిస్తాయి
భ్రమలన్ని నిజంగా , నిజమే ఓ భ్రమలా తోస్తాయి

జీవితానికో అర్ధం పరమార్థమే ... జీవితాన్ని అర్థం చేసుకోవడమే దాని అంతరార్ధం
ఇన్ని వెలుగులు చూపిస్తున్న సూర్యూనికే తప్పలేదు గ్రహణం
అల్ప జీవులం మనం దీన్లో అంతరార్ధం గ్రహించగలం
ఎంతటి వారికైనా బాధలు తప్పవు ఈ లోకాన

వాటిని భరించలేని వాడు ఎన్నటికి జీవితం లో పైకి రాలేదు
వాటన్నిటిని అధిగమించే వాడే ఈ లోకానికే రారాజు
పట్టుదల ధైర్యం కలసి మేలసిననాడే అసలైన విజయోత్సవం
అదే మన జీవిత రహస్యం అదే చీకటిని చీల్చే అరుణోదయ కిరణం

మన సార్థకత కి లేవు కళ్ళేలూ జీవితానికివ్వు ఒక మంచి అర్థం
దేవుడు మనకి అన్ని ఇచ్చాడు నమ్మకం మనం ఆ దేవునికి ఇవ్వాలి
ఏనాటికైనా గెలుపును సంధించాలనే ఆలోచన సార్థకం అవ్వాలి
అదే మనం మన దేవునికి ఇచ్చే అసలు సిసలైన నీరాజనం

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల