అలల కల

సూర్యుడు వెలుగు పంచుతాడనుకోని కాపలా ఉంటాడని అనుకుంటే
అస్తమించాడు చీకటి తెరలను నా ఎదుట నిలిపి
అనుకున్నా ఎప్పటికైనా ఆ సూర్యుడు వస్తాడని , వేలుగునిస్తాడని
నిడురపోయి లేచాను కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగులతో ఉన్నాడు సూర్యుడు కళ్ళ ముందు
అనుకున్నా ఇది ఒక క్షణమని

వెన్నెలలో జాబిలి వలె మంచు కురిపిస్తున్నాటు చంద్రుడు ఉదయించాడు అనుకుంటే పగటి ద్రిస్టి చుక్కల మిగిలాడు సూర్యుని తాపానికి అనుకున్నా ఎప్పటికైనా ఆ చంద్రబింబం వస్తుందని , ఆ వెండి మెరుపులు మెరుస్తాయని , అలసి సొలసి అనుకున్నా ఇది ఒక నిమిషమని

కోయిల రాగాలు తీసింది , చెట్లు చిగురులు తొడిగాయి , నెల కళకళలాడింది , పాచిక పైరు తుళ్ళి తుళ్ళి ఆడింది
నవ వసంతం వచిందనుకున్న , ఎండలు ముదిరాయి వాన వస్తుందనుకున్న , జల్లే కురిపించి అలసటే మరిపించావు
అనుకున్నా ఇది ఒక మాసమని
వెచ్చగా పలకరించి మనసు దోచి ఆపై ఉప్పెన తో హింసించి వేల్లిపోయావ్

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం