Posts

Showing posts from March, 2014

శ్రీ జయ నామ ఉగాది శుభాకాంక్షలు

మన పెరట్లోని మామిడి కాయల వగరు మనలోని బాధను మన నుండి వేరు చెయ్యాలి ఆ చేదు  వేప పువ్వులు మనలోని చెడు గుణాన్ని పారద్రోలాలి ఆ తీపి అరటి బెల్లం పాకం మన జీవితాల్లో మంచిని పంచాలి తీపి కారం చేదు  వగరు పులుపు ఉప్ప: అన్ని కలగలిపి జీవితానికే తలమానికగా నిలవాలి నా స్నేహితులకు, సన్నిహితులకు, గూగుల్ ప్లస్ వీక్షకులకు, నా బ్లాగ్ పాఠకులకు కావ్యాంజలి బ్లాగ్ తరపునుండి శ్రీ జయ నామ ఉగాది శుభాకాంక్షలు ఇట్లు, మీ శ్రీధర్ భూక్యా  

చూడు

దుఃఖం బంధించిన పెదవులపై చెరిగిపోని చిరునవ్వు సంతకాన్ని చేసి చూడు  , ఆ నవ్వు ప్రవాహానికి దుఃఖమే కొట్టుకుపోతుంది  లోకమే కొత్తగా కనిపిస్తుంది    బాధతో నిట్టుర్చుతూ రాల్చే కన్నీటిని అధిగమించి తల పైకెత్తి చూడు, ఆ చూపులకే బెదిరిపోయి బాధనేదే లేకుండా చెల్లా చెడురై పోతుంది ఉద్వేగం తో లయతప్పిన హృదయ కవాటాల్లో ప్రేమను సంతోషాన్ని నింపి చూడు, తన్మయత్వం తో లయబద్దమైన ఊయలలుగుతూ ఉప్పొంగిపోతుంది  వేదన అనే కల్మషాన్ని నీ జీవితం నుండి పారద్రోలి చూడు, నిన్నటి దాక  నీది కాదనుకున్న జీవితమే నీకు కొత్త దారులు చూపుతుంది 

పడవ

నేను ఓ నావ తయారు చేసాను, దానిని స్నేహపు నావ అని పేరు పెట్టాను సమాజం అనే సంద్రం లో, లోకులనే అలలపై నా నావను నడిపించే ప్రయత్నం ఓ స్నేహం చెయ్యి చాచి పిలిచింది, పదునాలుగేళ్ళ క్రితం దానికి ఆటుపోట్ల ప్రేమ సునామి వచ్చి ఖంగు తిని పదవ ను మరల ఒడ్డుకి చేర్చాను ఇంకో స్నేహం ఎదురయ్యింది, కళ్ళముందు కదలాడే మరపడవను తలపిస్తూ నన్నే అందులో రమ్మని ప్రాదేయపడింది, స్నేహానికి వెలకట్టలేని నేను సరేనన్నాను నడి సంద్రానికి చేరుకున్నాక ఆ పడవకు రంద్రం ఏర్పడి నీళ్ళు లోనికి రా సాగాయి ఒకడు స్నేహం అని వాదిస్తే ప్రేమ అన్నారు, ఇలా కాదని ఆ 'జన' సంద్రాన్ని ఈదుకుని ఒడ్డుకు చేరుకున్నాను నా పడవ  ఆ ఒడ్డున లేదు, దానిని ఎవరో ఎత్తుకు పోయారు స్నేహానికి విలువలేదని ఆకర్షణే ప్రేమ అని అనుకుని వెళ్తున్న నాకు నా పడవ  ఇసుక లో కూరుకుపోయి కనిపించింది స్నేహాన్ని మించి  ఆకర్షణ , ఆకర్షణ ను మరిపించే ప్రేమలు కూడా ఉంటాయని అమ్మ ప్రేమే అందుకు సాక్షమని తెలిసి మనసు తేలిక పడింది

వడగళ్ళు- వడగాల్పులు

రెక్కలు కట్టుకు ఎగిరే పక్షికి ఆకాశమే హద్దు గాలికి పోటి పడి కురిసే వానకు కాలగమనమె హద్దు  మితి మీరడం ప్రకృతి మనకు నేర్పించకపోయిన మనిషి ఆలోచనలను  చిందర వందర చేసి పుట్టే చెడుకు ఆనవాళ్ళు  కరిగిపోయే హిమపాతమే వడగళ్ళై కురిసే తీరు చలిని చంపే సూర్య రాష్మే వదగాల్పులై శక్తినంత పీల్చుకునే తీరు  బంధాల బాంధవ్యాల నడుమ బంధానికి బాంధవ్యానికి తేడా తెలియని మూర్ఖులు కొందరు  ఆహ్లాదం కోరుకునే మనసుని విరిచి శునకానందం పొందేది మరి కొందరు  (ఈ కవితలో వాడిన భాష కాస్త కటువుగా ఉన్నా, ఎవరిని ఉద్దేశించి వ్రాసినది కాదని తెలియపరుచుకుంటున్నాను)

ఇంటర్నేషనల్ విమెన్'స్ డే

ఒకరి కల్పవల్లి ఒకరి నిత్యాలంకారి ఒకరి మనసులో నిక్షిప్తమైన  భరిణ, ఒక అమ్మ ఒక చెల్లి ఒక భార్య  కాని ఎక్కడ చూసిన మగువ తన ఉనికిని మనకు తెలుపుతూనే ఉంది  అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత వీర వనీతలందరికి,  నేటి మేటి యువరాణులకి, నవయుగపు మహిళమణులకు  కావ్యాంజలి బ్లాగ్ తరుపునుండి నా శుభాభినందనలు

కంప్యూటర్ + ఆధునికికరణ = కంప్యూటరికరణ

Image
Image Courtesy: Wikipedia Samsung Galaxy Gear Fit ​ ఔరా ఏమి ఈ వింత: అలనాడు కాలు కూడా మోపలేని విధముగా ఓ పెద్ద గదిలో వైర్లు ఒకదానిమీద మరొకటి పెనవేసుకుని చాంతాడంత మల్లెల మాలికల మీటలు బీటల్ల చప్పుళ్ళు  చేసే పరికరాలు ఉండేవట  అది కాస్త మెల్లిమెల్లిగా గది మొత్తాన్ని వీడి గదికి ఓ మూల ఉండే పెద్ద పరికరం అయ్యింది  మీటలు నొక్కితే ఒకట్లు సున్నాలే ముత్యాల హారాల్ల నల్లని స్క్రీన్ పై తెల్లటి అక్షరాలూ పెనవేసుకున్నాయి  ఆకారం తగ్గి బక్క చిక్కి ఓ పక్కగా రంగులదుముకుని మన ముందుకు ముస్తాబై వచ్చింది  అక్షరాలూ బొమ్మలు గీసుకునే 'ఎలుక'ను తన తో తీసుకు వచ్చింది మన ముందుకు  వాక్యూం ట్యూబ్లు కాస్త గోర్డాన్ మూర్ లా వలన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్  అయ్యాయి  అన్ని తమలో దాచుకుని సకలం నేనే అని చెప్పాయి, గిర గిర తిరిగే పళ్ళాని డేటా సేవ్ చేసుకునే ప్లాటర్ హార్డ్ డిస్క్ అయ్యి  వినూత్నంగా  వాటిని తలదన్నే లాగ సిమోస్ నాండ్ ఫ్లాష్ మెమోరీస్ వచ్చి కాస్త ఆ మూలనున్న పరికరాన్ని వొళ్ళో పెట్టుకునేల  మనతో పాటు ఎక్కడికైనా తోడుగా తీసు...

అలుపెరగని బాటసారి

జీవితపు ప్రతి ఘడియ ఓ మైలురాయే, ఎన్ని దాటినా మనముందు మున్ముందు అలాంటివి ఎన్నో మరెన్నో  వాటిని అధిగమించి  దూసుకు వెళ్లాలే తప్ప వెనుదిరిగి మనః సాక్షి ముందు దోషిగా నిలబడకు ఏనాడు ఓ బాటసారి  నీ ప్రతి అడుగులో తెలిసి తెలియని అలజడులేమైన ఉన్నా, రెప్ప మూసి తెరిచేలోపు కన్నీరు ఏరులై పారినా  కస్తాల కడలి దాటకుండా నీ మజిలికి నువ్వు చేరలేవు, అన్ని ఋతువులు కలగల్పితే ప్రకృతి అవుతుందని మర్చిపోకు ఓ బాటసారి నిస్సహాయత నిన్ను తన వాకిలి ముందు నిలువర్చిన, మనోబలం తో ఆ జిగటను వదిలించుకుని వడివడిగా అడుగులలో అడుగులేస్తూ సాగిపో ఓ దీశాలివై, వ్యాకులతకు చరమగీతం పాడి నవలోకం నీ కళ్ళ ముందు నిన్ను ఆహ్వానించేలా ఓ బాటసారి