Posts

అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను!

అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను! నీ మదిలో నిలిచినా భావాల కలయిక నేను!! అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను! నీ గుండె లయగతులలొ ప్రతిధ్వనించే రాగం నేను!! అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను! నీ స్పందన ప్రతిస్పందన లో కలిగే ఒరవడి నేను!! అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను! నీ జ్ఞాపకాలను ప్రతిబింబించే నిలువుటద్దము నేను!! అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను! అంచెలంచెలుగా ఎదిగే కోపాగ్నిని చల్లార్చే హిమపాతాన్ని నేను!! అక్షరాన్ని కాను కావ్యాన్ని నేను! మాటలు నేర్చి నవసమాజానికి దారిచూపే బావుటాను నేను!!

ఘర్షణ-సంఘర్షణ

కన్నులకు  దాచడం తెలియదు ,  అందుకే కలల రూపం లో నిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది మనసుకు మాట్లాడడం రాదు, అందుకే మూగాభాషను తనకు దగ్గరైన వాళ్ళ మనసులో చేరవేస్తుంది హృదయానికి దేనికెలా స్పందించాలో తెలిదు, బాధ ఐన సంతోషమైన అతిగా కాని అల్పంగా కాని కొట్టుకుంటది కన్నుల్లో కలల కొలనులో ప్రతిబింబించే ప్రతి బింబం మనం ఇంతకూ మునుపు చూసినదే వెన్నెల గీతికలు మనం ఇంతకూ మునుపు విన్నవే ఐన ఎందులకో ప్రతి సారి ఏదో కొత్త రాగం పలికినట్టు మనసు ఎటు తెల్చకా సతమతమవుతుంది ఎటు వేళ్ళలో దారి తెలియక, తెలిసిన దారి ఐన మనసు ఒప్పక, మనసు ఒప్పిన ప్రాణం ఒప్పక ఇలా ఒక్కో అవయవం ఒక్కోసారి నిరాకరణ కు గురవుతూనే ఉన్నాయి, లోకం ఇలా సాగిపోతూనే ఉంది   

మనుసు గేయం

ఊహాలొకమున ఏమున్నది గడిచిన కాలే జ్ఞాపకాలు  తప్పా, ఎంతగా ఉబలాటపడినా గొరంత మార్చలేమూ, నిండు మనసు లొ ప్రేమపు చమురుతొ జనకొటీ హృదయాల్లొ ఆశాజ్యొతి వెలిగింపజూడూ,  నీ లొకం నీకే కొత్తగా అనిపించును ఆ చిత్తరూపులేని, చలించనీ మూగభావాలు ఎప్పటికీ మారవు, మార్పునకు నీవే నాంది పలుకు, ఎంతో నిష్టతొ తప్ప పొందలెని ఈ మానవ జన్మని సార్థకం చెసే మానవత్వం మిళితం సేయు, కరిగిపొయిన ఆ కలలే అలలా పారి, నిన్ను మరల తాకలెవు వ్యర్థ ప్రయాసా కంటినిండుగ కన్నిళ్ళతొ మనసునిండుగ బాధటొ జీవిస్తె జీవింపజాలదు, మనిషనేవాడి జన్మ మంచి చెయ్యడానికే అన్నా హితము తెలుసుకొనినా, ఆ పీడకలలు కల్లలయ్యీ, మనసు తెలిక పడి, ఉరకలేస్తు నవ్వుతుంది పెదాలపై వికసించె నవ్వు ఇక ఎప్పటికి చెరిగిపొదు 

ఓ రేతిరి సుక్క

ఎన్నెల్లో ఒదిగిపోయిన సక్కాని సుక్క నీ ఏనాకేనకే నేను రానా ఓ బుల్లి కన్నుల్లో కాటిక నా మనసు కోస్తాందే ఓ చెలి జాబిలీ కొమ్మ సేరి సరసాలాడానికి వస్త నంటి వే గాని పొద్దు పోయే దాంక రాలే ఏమైతదో అని ఒకటే దిగాలుగున్నది ఓలమ్మి సెరువు గట్టు కాడ నక్కి నీ కోసం ఎంతసేపని ఎదురు సుసేది ఈ  సక్కని సుక్కని సుడందే ఉండలేనని ఎరిగి రానని అలిగినావ ఎం సక్కని నీ పలుకులు ఇందాం అని పరుగు పరుగున వస్తే నీరు గార్చకే ఓమ్మి కూకున్న ఈడనే ఈ సెట్టు తాన ఘడియ రెండు ఘడియలు దాటినాయి ఓ రేతిరి సుక్క రాయే ఇటు పక్క ఈ కొత్త కవిత నా చిన్న ప్రయోగం. ఎలా ఉందొ మనవి సేయు ప్రార్థన

నా నీడ

నా నీడ నువ్వని  నిన్ను నేను అనుకున్న నన్ను వెంటాడే కలవని నిన్ను నిదురలోనే కలవరించా వెండి మబ్బు కరిగిపోయింది ముత్యపు చినుకులా నేను నిన్నే తలుచుకున్న ఇప్పటివరకు జీవితం ఇంతే కాదు ఇంకెంతో ఉందని అనిపిస్తుంది నీ తియ్యని ప్రేమ మాయలో ఏమి జరుగుతుందో తెలిసే వీలే లేదు అడుగు జాడే లేకుండా మనం నడిచిన ఆ ఒడ్డులో ఆ జ్ఞాపకాలన్నీ ఇవేళ ఇసుకలో రాతలై మిగిలిపోయాయి ఒంటరిగా అలల తాకిడి ఒరవడిలో...!!

అందనంత దూరం

 నువ్వు పరిచయమయ్యావు నా లోకమే మారింది నిన్ను తలచుకున్న ప్రతిసారి ఏదో తెలియని ఆనందం కలిగింది  ప్రేమో ఆకర్షణో తెలియని వయసు ఐన నా మనసుని కొల్లగొట్టింది  ఇన్నేళ్ళు ఐన నిన్ను మరవలేదంటే అది ఆకర్షణ ఎంత మాత్రం కాదంటుంది నా మనసు  ఏమో మరి నువ్వు ఉన్నప్పుడు నాకు ఎలాటి వెలితి కనపడలేదు  ఇప్పుడేమో నా ప్రతి పదం ముందు ఒక సారి వెనక ఒకసారి నిన్ను తలవక మానసోప్పదు ఇన్నేళ్ళ మన పరిచయం అన్ని రంగులు చూసింది  మన పరిచయాన్ని నేను ఉద రంగు తో పోలిస్తే  అది పండి గోరింటాకు నారింజల  మెరిసింది  తామర రేకులా నాజుకైనా నా ప్రేమ కలగలిపి ఎర్రగా పండింది  అంతలోనే అమావాస్య చీకటి అలుముకుంది  నా అందాల జాబిలీ నిన్ను నా నుండి దూరం చేసింది నువ్వేమో అక్కడ నేనేమో ఇక్కడ అందుకున్నంత దూరం లోనే అందనంత దూరం

నీ స్నేహం ఓ అపురూప వరం

స్నేహం నీదు తోడైనా మబ్బుల్లో చినుకునై భువిపై జాలువారుతా  స్నేహం నీదు తోడైనా కటిక చీకటిలో వెండి వెన్నెలనవుతా  స్నేహం నీదు తోడైనా కంటిపాపలో కమ్మని కలనై కొలువుదీరుతా    స్నేహం నీదు తోడైనా చిటారు కొమ్మపై వాలే వసంతమై పలకరిస్తా స్నేహం నీదు తోడైనా పసిపాపల మోముపై చెరగని చిరునవ్వునవుతా  స్నేహం నీదు తోడైనా రెక్కలు కట్టి నీ దరికి చేరుకునే చిరుగాలినవుతా