నీ స్నేహం ఓ అపురూప వరం

స్నేహం నీదు తోడైనా మబ్బుల్లో చినుకునై భువిపై జాలువారుతా 
స్నేహం నీదు తోడైనా కటిక చీకటిలో వెండి వెన్నెలనవుతా 

స్నేహం నీదు తోడైనా కంటిపాపలో కమ్మని కలనై కొలువుదీరుతా   
స్నేహం నీదు తోడైనా చిటారు కొమ్మపై వాలే వసంతమై పలకరిస్తా

స్నేహం నీదు తోడైనా పసిపాపల మోముపై చెరగని చిరునవ్వునవుతా 
స్నేహం నీదు తోడైనా రెక్కలు కట్టి నీ దరికి చేరుకునే చిరుగాలినవుతా

Popular Posts