ఉప్పెన : అలలతీరం లో రేగిన అలజడి : కడలి కెరటం ౩

 సంద్రం నుండి వైజాగ్ సిటీ వ్యూ : కర్టసీ: వికీపీడియా 
1971 వార్ మెమోరియల్ "విక్టరీ అట్ సీ ", బీచ్ రోడ్ , కర్టసీ: వికీపీడియా 
 రాధాకృష్ణ అట్ కోస్టల్ బాటరీ 

"ఇంకా మొదలు పెట్టనే లేదు.. అప్పుడే సస్పెన్స్ ఆ..? ఇంతకీ ఇప్పుడు ఎం చెప్పబోతున్నావు"
"అలా అడుగుతారెంటి నే చెప్పబోయేది ముమ్మాటికి జరిగినదే.. పదండి అలా ఈ తీరం వెంబడి నడుచుకుంటూ మాట్లాడుకుందాం"
"అలా మా పదిహేనో ఏట, మొదలైన ఆ తొలివలపు మొదట నన్ను తాకింది, మెల్లిగా తనకు సోకింది, ఆ తరువాత ఇంట్లో తెలిసింది, కథ ముగిసింది"
"ఏంటిది.. పుష్కర కాలం పట్టినట్టు దాఖలాలు ఏమి లేకుండా పూర్వం 'కట్టే కొట్టే తెచ్చే' లా ఒక్క ముక్క లో ముగించేసావ్, దీనికోసం కూర్చుంది చాలదనట్టు యారాడ నుండి ఈ ఫిషింగ్ హర్బౌర్ వరకు తీరం వెంబడి నడిపించావ్ ఏమైనా ఉందా ఇందులో అంత గొప్పగా చెప్పుకోవడానికి; ఈ కంపు భరించలేకున్నాం, త్వరగా నడు "
"అలా తీసి పారేయొద్దు, ఇది చాల పెద్ద కత, అంత చెబితే మీరు వింటారో లేదోనని ఇలా మొదలు పెట్టాను."
"హమ్మ.. ఓపిక నశించింది .. ఇక నడవడం మా వల్ల కాదు"
"ఇక్కడ కూలబడితే ఎలాగ..? ఇదంతా నేవీ ఏరియా, కోస్టల్ బాటరీ దగ్గరకు వచ్చేశాం, ఇక కాస్త ముందుకు వెడితే షాప్స్ అవి ఉంటాయి, ఏమైనా తిని అసలు కథ, మీకు ఓపికుంటే చెబుతాను"
"సరే పదా.. ఒప్పుకున్నాక వినకుండా ఉంటామ ఎం? ఒక్క విషయం, ఇందాక చెప్పిన దానికి ఇంతకూ మునుపు చెప్పిన దానికి సంబంధమే లేదు..!! కాస్త ఆగు, ఆ రాధాకృష్ణుల ప్రతిమను క్లిక్ మనిపిస్తా... "
"ఏదో చెబుతున్నాడు ఆసక్తిగా విందాము అంటే మాకు తెలిసిన విషయాలే చెబుతున్నాడే తప్పితే ఒక్కసారి కూడా అసలు విషయానికి రాడేంటి అని పోరాబడుతున్నారా?"
"లేదు లేదు ఇంత హంగామా చేసి మమ్మల్ని ఇంత దూరం నడిపించావంటే నిజంగా ఏదో ఉంది అని ఇంతకూ ముందే కనిపెట్టం లేవోయి.. ఇక అసలు విషయం లోకి రా "
"ఎం చెప్పమంటారు.. అలా ఆ కవలల్లో ఒక అమ్మాయి అంటే పడిచచ్చేవాణ్ణి, అంత అయోమయం గా చూడకండి, అప్పటికది ఆకర్షణ ఎంత మాత్రం కాదు, వన్ సైడ్ లవ్ అంతే, తన పుట్టిన రోజు నాడు నా ఒక్కడికి నాలుగు చాకోలేట్స్ ఇస్తే మురిసిపోయా, అందులోని ఓ రేపర్ ని నా డైరీ లో అంటించా"
"అబ్బా .. ఎం చెప్తున్నాడు రా...మురిసిపొయింది చాలు..  ఆ తరవాత చెప్పే ముందు, కాస్త అలా ఆ మూరీ మిక్చర్ తిందాం, ఆకలిగా ఉంది"
INS కురుసుర 

"సరే పదండి, గుఱ్ఱపు  స్వారి కూడా చేద్దురు గాని"
"ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడకు వచ్చి చేరుకునట్టు?"
"ఎం కంగారు పడకండి.. మనం ఉన్నది 'రామకృష్ణ  బీచ్', అదుగో ఆ బిల్డింగ్ కనిపిస్తుందే అదే 'రామకృష్ణ మిషన్'"
"బాబ్బాబు.. నేనడిగింది ఎక్కడున్నాం అంటే కథ లో ఎక్కడున్నాం అని.."
"ఓ అదా.. నేనింక ఇప్పుడే మొదలుపెట్టాను చెప్పడం; అలా దాచుకున్న రేపర్ ని వెంటబెట్టుకుని కాలేజీ కి వెళితే, కొందరు ఆకతాయిలు ఆటపట్టించడం మొదలుపెట్టారు. "
"ఇది మామూలే గా ఇందులో వింతేముంది"
"ఆ క్షణం వరకు ఏమి తోచని నాకు ఎందుకో ఆ అమ్మాయిని చూసినాక ఎక్కడో పెట్రోమాక్స్ వెలిగింది "
"అదేమిటి వింతలో వింతా, బుల్బ్ అంటారనుకుంటా"
"ఔననుకొండి కాని అప్పటికి నాకు పదహారు వయసు వచ్చి ఓ పద్దెనిమిది రోజులే అయ్యింది, అప్పుడింక ఇప్పుడున్నంత లోకజ్ఞానం లేదు కదా "
"మా నాయనే ఎం పోల్చావయ్య.. ఇంతకీ ఏమైందో చెప్పు మరి"
"తీరా  ఓ రోజు ఆ అమ్మాయికి ఎలా తెలిసిందో తెలిసిపోయింది, కాలేజీ లో ఆ వార్తా పాకి ఆ నోటా ఈ నోటా నాని ఇంకి పోయే స్టేజి కి వచ్చింది"
"ఓయబ్బో ... ఇవన్ని కొతలైతె కాదుగదా, ఐన నీ మొహం పై పడుతున్న ఆ చమటలే చెబుతున్నాయి, తుడుచుకో"
"మీరు ఏమనుకోకపోతే కాసేపలా ఈ ఆక్టోపస్ బిల్డింగ్ దగ్గర కుచుందాం, పక్కనే '1971 వార్ మెమోరియల్' ఉంది, ఆ ఎదురుగ కనిపించేదే కురుసుర సుబ్మరిన్ అదే జలాంతర్గామి, పాతబడిపోతే ఇక్కడ మ్యుజియం ల పెట్టారు"
"ఇప్పుడివన్నీ ఎందుకు లే అసలు విషయాన్నీ దాచడానికా..? అదేమి  కుదరదు ఎలాగైనా చెప్పి తీరాల్సిందే, ఈ తీరం వెంబడి ఇప్పటికి ఎంత దూరం వచ్చామో నాకేమి బోదపడుటలేదు"
"మిమ్మల్నందరిని పిలిపించింది అందుకనే, మధ్య మధ్య లో విసుగు రాకుండా ఇలా చూపిస్తున్న"
"వెనకటికెవడో 'చంకలో పిల్లాడిని ఎతుకుని ఊరంతా వెతికినట్టు', నిన్ను పక్కనే ఉంచుకొని మరి ఊరంతా తిప్పిస్తున్నావ్ గా"
"అమ్మ!! ఎంత మాట అనేసారండి, సరే అలాగే చెబుత వినుకోండి,...  అది తెలిసి ఆ కవలల్లోని  అక్క అగ్గి మీద గుగ్గిలం లా అంత  ఎత్తుకు ఎగిరి తన కోపాన్ని ఆవేశం తో కలిపి చిందేసింది, ఆ తాకిడికి చెమటలు పట్టేశాయి"
"ఇంకేముందిలే కథ అడ్డం తిరిగి బోల్త పడి ఉంటావ్, ఆ మరపడవ లా అంతేనా?, ఉప్పెన కెరటం అన్నావ్ గా అందుకే పడవ తో పోల్చాను "
"ఊరుకోండి మీరు మరీను... అదే జరిగుంటే ఈ పుష్కర ఘట్టం ఎప్పుడో ముగిసేది కదా... "
"సరే మరి ఏమైందో చెబితే వింటాం"
"అలా జరిగిన రెండో రోజు నేను తనకి క్షమాపణ లెటర్ ఒకటి గ్రీటింగ్ కార్డు తో సహా పంపించా "సారీ" అంటూ , ఇంకేముంది, అది లవ్ లెటర్ అని, అది లవ్ ప్రపోసల్ కార్డు అనుకుని ఈ సారి అసలు అమ్మాయి వచ్చి 'నీ తాట ఒలిచేస్తా బిడ్డ' అన్న స్టైల్ లో వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది... మనం ఇప్పుడు కైలాసగిరి కొండ దగ్గరకు చేరుకున్నాం"
" మిగితాది కొండ దిగినాక విందాం, నువ్వు చెబుతుంటే నిజంగా జరిగే ఉంటుంది అని ఎక్కడో ఓ చిన్న అనుమానం"
"మళ్ళి అనుమానం ఏమిటండి, మనం ఇక్కడ లుంభిని  పార్క్ ఎదురుగ కనిపిస్తున్న అప్పుఘర్ దగ్గర ఈ రోప్ వే లో వెళ్దాం"
"ఇప్పుడు నడిపించిన నడక కంటే ఇదేమ్ ఎక్కువ కాదు అలాగే కాని, కాళ్ళు బాగా లాగేస్తున్నాయి "
"పైన టాయ్ ట్రైన్ ఒకటుంది అది ఎక్కుదాం, సరేనా.. ఏదో ఒకటి, కాని తరవాత ఎం జరిగిందో కచ్చితంగా చెప్పాలి సుమీ"
"అలాగే ఇదుగోండి టికెట్లు... తప్పాయి మీకు ఇక్కట్లు "
శ్రీ రామకృష్ణ పరమహంస మిషన్, బీచ్ రోడ్, కర్టసీ వికీపీడియా 
రామకృష్ణ బీచ్ - కైలాసగిరి-ఋషికొండ బీచ్ రోడ్ 

"హమ్మయ్య, ఎలాగోలా కైలాసగిరి చూసేసాం, ఇక అటు ఎక్కడికయ్య "
"రండి ఇంకా మీకు చెప్పాల్సింది చాల ఉంది... అలా వెళుతూ మాట్లాడుకుందాం... ఆ సంగటన జరిగిన తరువాత ఒకరినొకరం చూసుకోలేదు"
"ఇంకేముంది ఐపోయింది అంతే గా, ఏదో ఇలా కైలాసగిరి చూపిస్తానని ముందే చెప్పొచ్చు కదా, దిని కోసం ఉప్పెన, అలా కెరటం అని మొదలు పెట్టావు"
"అర్రే అలా ఎలా అనుకున్నరు... గమనించండి అప్పటిదాకా నేనొక్కడినే ప్రేమించా అందుకని సైలెంట్ అయిపోయా, అంటే ఇప్పుడు కెరటం వెనక్కి సంద్రం లో వెళ్ళిపోయింది"
"మళ్ళి ఎప్పుడు అలా ఒడ్డుకు వచ్చిందో సెలవియ్యండి మరి... "
"చెప్పడానికేం లేదు, ఆ ఐదేళ్ళు మా మధ్య ఎలాంటి పలకరింపులు కాని, సంప్రదింపులు కాని ఏమి జరగలేదు"
తెన్నెట్టి బీచ్ దగ్గర సూర్యాస్తమయం ఇమేజ్ కర్టసీ: వికీపీడియా 

రామకృష్ణ బీచ్ రోడ్ ఇమేజ్ కర్టసీ: వికీపీడియా 

కంబాలకొండ రిజర్వు ఫారెస్ట్ ఏరియా  ఇమేజ్ కర్టసీ: వికీపీడియా 

"ఇక మనం ఇక్కడ కాసేపు రెస్ట్  తీస్కుందాం, భోజనాలవి కానివ్వాలి కదా, అందుకే ఇక కంబాలకొండ లో రిసార్ట్ ఒకటి బుక్ చేశా, తీరికగా రేప్పొద్దున్న ట్రెక్కింగ్ చేసి, ఆ తరువాత రుషికొండ మీదుగా భీమ్లి వెళ్తున్నాం"
"ఏమో గాని మొత్తం బ్యాక్ డ్రాప్ అంత సముద్రాన్నే తెస్తున్నవే. సరే అలాగే కానిద్దాం మరి"

రోప్వే టికెట్ ఛార్జ్ : (ఎగుడు దిగుడు): INR 80*6=480
టాయ్ ట్రైన్ టికెట్ ఫేర్: INR 25*6=150
షాపింగ్ అట్ క్రాఫ్ట్ బజార్: INR 350
ఫూడ్: INR120*6=720
కంబాలకొండ రిసార్ట్ టరిఫ్ఫ్: INR 1500 * 3 (డబల్ బెడ్ స్వీట్ ): 4500
భీమునిపట్నం టు బస్ స్టేషన్ కాంప్లెక్స్: INR 40*6= 240

Popular Posts