కొన్ని తీపి నిజాలు
చినుకుల అందెలు తొడిగి తొలకరి నేడు నన్ను పలకరించింది ఇలా
చల్లని గాలి ఏదో నా మనసుని ఓలలాడించింది నన్ను మైమరపించింది ఇలా
ప్రతి చినుకు చిరుజల్లు ను చూస్తూ మనసు ఉప్పొంగింది నేడు
నేల రాలే సుమాల దారిలో రంగురంగుల ఈ య'వనం' హాయిగా కనిపిస్తుంది నేడు
కలతలు కలహాలు కల్మషాలు ఏమిలేని నవలోకం చూడాలి
బోసినవ్వులు చిందించి చిన్ని పాపాయిలతో ఆడుకోవాలి