మురళి రవం

వేణుగాన మురళి రవం ఆలకించాను నేను 
మైమరపించే ఆ రాగం ఎచట నుండి వస్తుందో 
నా మనసుని యిట్టె అలుముకుంది 
వెదురులో గాలి విన్యాసాలు వీనులవిందు చేసి 
మెల్లగా వెనుతిరిగింది, తన కమ్మని స్వరాన్ని నా మదిలో నాటి 

వీణ నాదం వినగానే మది పులకించి పోయింది 
తంతి మీటుతుంటే మదిలో భావం ఉరకలేసింది 
ఒక్కో స్వరం అలా పలకిస్తూ ఉన్నా కుష్మాండ భాండం అది 
నన్ను సంమోహితుని చేసి నాలోని తంతిని లాగింది శృతి చేస్తూ 

Popular Posts