కుసుమపరిమళాలు

గాలినై ఉండి ఉంటె నిన్ను క్షణాల్లో చేరి ఉండేవాడినేమో,
 కాని నీ ఉచ్చ్వాస నిశ్వాస లో ఓ ఘడియే నిలిచుండే వాడిని

నిప్పునై  ఉండి ఉంటె చల్లని మంచువుల్లో హాయిగా నీకు వేడిమి పంచేవాడినేమో ,
 కాని నిన్ను చూస్తూ చూస్తూ నీ ఎదుటే కాలి బూడిదై  మిగిలే వాడిని

నీరునై ఉండి ఉంటె నీ దాహార్తిని  హరించే వాడినేమో,
కాని బాధ కలిగి నీ కన్నిరునై రాలిపోయే వాడిని

చెట్టునై ఉండి ఉంటే నా నీడలో నిన్ను సేదతీర్చేవాడినేమో,
ఎడాపెడా అడవుల్ని నరికివేస్తె మూగగా రోదించే వాడిని

అందుకే మనసున్న మనిషినై పుట్టాను,
నీ బాధ పంచుకునే నేస్తాన్నై జనించాను
నీ ప్రేమను పొందాలని ఆశగా ఎదురు చూసాను,

ఎడబాటు నిన్ను నాకు దూరం చేసింది
కానరాని దూరాలకు మనల్ని విడదీసింది

నీ జ్ఞాపకాలు నా చెంతనే పథిలంగ ఎప్పటికి చెరిగిపోకుండా ఉన్నాయి
కొన్ని ఈ కవితల్లో అక్షర కుసుమాలై పరిమళాన్ని వెదజల్లుతూ ఉన్నాయి

ఆకాశం హద్దుగా ఆ మబ్బుల మాటు దాగిన సూర్యునిలా నా ప్రేమని ఎప్పుడు నీపై ప్రసరిస్తూనే ఉంటా
నీ జ్ఞాపకాల చిరుజల్లుల్లో ఎప్పటికి తడుస్తూనే ఉంటా... నా భావాలను ఇలా పెరుస్తూనే ఉంటా 

Popular Posts