చూడలనున్నది

రెక్కలు కట్టి ఎగరాలనుంది మనసుకు సుదూర తీరాల వెంబడి గగన తలం తాకి రావాలనున్నది
ఈ వింత ఆనందానికి అవధుల్లేకుండా అనంతాలకు వెళ్లి రావాలనున్నది
తార తీరం లో ఆ చుక్కల తోడుగా పొద్దు పొడుపులో చల్లని మంచుబిందువుల్లో హాయిగా ఆడాలనున్నది

కల్మషం లేని మనసుని నేడు వీణలా  మీటుతున్న నాదం ఏమిటో తెలుసుకోవలనున్నది
కన్నుల మాటున సాగే కలల జాడలు వెతకాలనున్నది
నీలి నింగిని వీడని మబ్బుల మాల లా ఎప్పటికి ఇలా నిన్ను నా యెదలో నిలపాలనున్నది

జాబిలీ చుక్కల సాక్షిగా వెన్నెల కలువల సాక్షిగా మౌనన్ని వీడాలనుంది
ఏదో తెలియని పరవశం తో మది ఊగిపోతుంటే నిలకడగా నిలవాలనున్నది
నా ఎదుటే ఉన్న ప్రకృతి నేడు నా చెంతకు చిగురించే ఆమనిని  తన వెంట తిస్కోస్తుంటే చూడలనున్నది  

Popular Posts