జీవితసత్యం

సూర్యుడు మండుతాడని అందరికి తెలుసు,అలా అని  సూర్యుణ్ణి  వెలివేయ్యలెం
చంద్రుడిపై నల్లటి మచ్చలున్నాయని అందరికి తెలుసు, అలా అని చంద్రుణ్ణి వెలివేయ్యలెం
మబ్బులు దుమ్ముధూళి అని అందరికి తెలుసు, అలా అని వృష్టిమేఘాన్ని వెలివేయ్యలెం
వెలుగు వికటిస్తే మిగిలేది  చీకటి అని అందరికి తెలుసు, అలా అని చీకటిని వెలివేయ్యలెం

మనతో పాటుగా ఎదిగే ప్రతి జీవి స్వేచ్చగా బ్రతకాలని కోరుకుంటాం
మన చుట్టూ ఏమి జరుగుతున్నా పట్టనట్టు మరి ఎందుకుంటాం
కలసికట్టుగా ఓ జట్టుగా ఒకే గూటి గువ్వలుగా బ్రతకమని హితవాక్యాలు ఇస్తూ ఉంటాం
కాని చేతల్లో అది చూపించక వెనుదిరిగి వెళ్లి పోతూ ఉంటాం.

చెప్పిన మాట చద్ది మూట అని ఎరిగినా  మనం పదేపదే చెప్పి తప్పు చేస్తూ ఉంటాం ఎందుకని
డబ్బుకు విలువ ఇచ్చింది మనం అని ఎరిగినా మనం మనకే విలువలు లేవని చాటి చెప్పుకుంటాం ఎందుకని
మనిషి ఆశజీవి అని ఆశలే  ఆశయాలకు నాంది అని ఎరిగినా మనం అత్యాశ కు ప్రాకులాడుతాం ఎందుకని
మనిషి జీవితం శాశ్వతం కాదని  ఎరిగినా మనం ఆ ప్రాణాన్ని విలువగా చుసుకోము ఎందుకని

కామక్రొధమదమొహలొభమాత్సర్యాలు అరిషడ్వర్గాలని
అవి ఎక్కువపాళ్ళు మన జీవితం లో ఉండరాదని
తెలిసి తెలిసి మనిషి వాటికి దగ్గరవుతాడు ఎందులకు
ఎరిగి చేసిన తప్పును సరిదిద్దుకోడు ఎందులకు 

Popular Posts