ఎదురు చూపులు

నీలాల ఆకాశం వైపు చూసా, నవ్వుతున్న నీ బింబం కనిపించింది,  మబ్బుల్లో దాగుడు మూతలు ఆడుతూ
బంగరు నేల వైపు చూసా, బీడుగా మారి బీటలువారి తడి ఆరిపోయి గోముగా చినుకును ఆహ్వానిస్తూ

పక్కనే ఉన్న మోడుబారిన చెట్టును చూసా, కండ కరిగి ఎముకలే మిగిలిన అస్తిపంజరాన్ని తలపించింది
ఆకులన్నీ రాలిపోయినా, చివురులు తొడిగే ఆశతో అది నిటారుగా వసంతం కోసం ఎదురు చూస్తూ ఉంది.

ఆశలు ఆశయాల ముందు బాధలు కన్నీళ్ళు అన్ని చిన్నవిగా అనిపించాలి 
జీవితం అంటే ఎగుడు దిగుడులు కష్ట సుఖాల మేలి కలయిక అని అడుగు ముందుకు వెయ్యాలి. 

ప్రకృతి మనిషికి ఎప్పుడు మేలు చేస్తూనే ఉన్నది, 
తనలో ఇమిడి ఉన్న అంశాలతో మనకు హితబోధ చేస్తూ ఉంటుంది 

Popular Posts