నీ ప్రేమలో ...

శ్రీకాకుళం లో మన ప్రేమకు శ్రీకారం చుట్టలనుకున్న
విజయనగరం లో మన ప్రేమపు విజయ బావుటా ఎగుర వెయ్యలనుకున్న
విశాఖపట్నం లో మన ప్రేమపు వైశాఖాన్ని చవి చూడాలనుకున్న

తూర్పు గోదావరి ఒడ్డున నువ్వు పశ్చిమ గోదావరి ఒడ్డున నేను గోదారమ్మ ఉరకలై ఉందాం అన్నావు
కృష్ణమ్మా ఒరవడిలో ఒకరికొకరం సాక్షిగా ఉందాం అన్నావు
రంగారెడ్డి నుండి హైదరాబాద్ దాక ప్రేమ పరుగులు పెట్టించావు

గుంటూరు మిరపంత ఘాటు ప్రేమ మనది అంటూనే కన్నీళ్ళు తెప్పించావు
నిర్మలమైన ప్రేమలో ప్రకాశిస్తామని పలికావు
నెల్లూరు నడిబొడ్డున నెలవంకల నా ముందు నిలిచావు

చిత్తూరు లో నిన్నెంత చిత్తుగా ప్రేమిస్తున్నానో అర్ధమయ్యింది
చిగురించిన ప్రేమ కోవెల గ(క)డప దాటి లోనికి పరుగులు తీసింది
అనంతమైన మన ప్రేమను ఆస్వాదించాలని అనంతపూర్ పయనమయ్యింది నా మనసు

కర్నూల్ కాకపొతే మహబూబ్నగర్ లో నైన నిన్ను నా దరికి పిలవలనుకున్న
నల్గొండ లో నీకోసం నాలుగు రోజులు వేచి చూడాలనుకున్న
మెదక్ లో నీ చేతికి మైదాకు (గోరింటాకు) పూయమన్నావు

వరంగల్ లో నా మీద ప్రేమతో ఒరిగిపోయావు
కరీంనగర్,ఆదిలాబాద్, ఖమ్మం చూసొద్దాం అని చెప్పిన నువ్వు
అది మరి నిజమో అబద్దమొ తేలలేక నిజామాబాదు తో చితికిల పడ్డాను

తీర ఇన్ని చేసిన తరువాత నువ్వెవరో ఎరుగనని విడిచి వేల్లిపోతనంటున్నావా?  

Popular Posts