కవ్వించే మనసుగల లలన
నీతో అలా సంద్రం ఒడ్డున నడచిన ఆ క్షణాలకు
నీ అల్లరి చేష్టలకు నీ ముద్దు ముద్దు మాటలకు
నీ బుంగ మూతి మెలికలు తిరుగుతుంటే కలిగిన ఆతృతకు
పులకించిపోయా మది నిండుగా నిన్నే నేను దాచుకున్న
నీ జ్ఞాపకాలు రోజు నన్ను ఇలా తడుముతూనే ఉన్నాయి
నాకోసమే నువ్వన్నట్టు నీకోసమే నేన్నన్నట్టు
ఒకరికొకరం ఓ జట్టుల మేలిగాము
ఎవరి కళ్ళు కుట్టాయో ఎవరి ఈర్శ్య కు లోనయ్యమో
నువ్వాదిక్కు నేనిదిక్కు మధ్యన వచ్చి పడింది చిక్కు
అలా మొదలై ఇలా అలలా వెనక్కి వెనక్కి వెనక్కి
నిన్ను తలుచుకుని బాదపడని రోజంటూ లేదు ఏడ్చాను ఎందుకో వెక్కి వెక్కి
కళ్ళల్లోని కలలు చెదిరి కలత నిదురే పడుతుంటది నువ్వు గుర్తుకు వస్తే