ఉప్పెన : అలలతీరం లో రేగిన అలజడి : కడలి కెరటం ౨

యారాడ బీచ్ ఇమేజ్ కర్టసీ: వికీపీడియా
"సరె.. నువ్వు ఉప్పెన గురించి చెబుతావు బాగానే ఉంది.. కాని ఉప్పెన అంటే సంద్రమే కదా... మరి అందులో ఎం విశేషం ఉంది? హ్మ్.."
"మీరు అనుకున్నట్టు నేను చెప్పే ఉప్పెన వేరు, మీరు అనుకుంటున్నా ఉప్పెన వేరు."
" అదేమిటి విడ్డురం కాకపొతే, పైన అలా అలలతీరం అన్నావు గా మరి.. అంత కూడా తెలియదా..?"
"భలే వారు మీరు, నాకు సంద్రం అంటే ఎందుకంత  ఇష్టం ఏర్పడిందో తెలుసా మీకూ ..?"
"తెలియదు.. ఐన ఇదంతా మాకెందుకు చెబుతున్నావు... ఇందులో కొత్త ఏముందొ అది చెప్పు"
"అక్కడికే వస్తున్నా.. ఆ సముద్రాన్ని ఎప్పుడైనా గమనించారా? తనలో ఎన్నో దాగుంటాయి, ముత్యాలు, చమురు, జీవరసాయనాలు, లవణాలు, ఇలా.. చెప్పుకుంటూ పొతే ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి"
"అది  తెలుసు! అసలు విషయానికి రావయ్య .. నువ్వసల ఎం చెప్పదల్చుకున్నవో సెలవిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం "
"అలా విసుక్కోకండి మరి.. నేను ఇప్పుడు చెప్పబోయేది నాకిదివరకు జరిగిన ఓ మరుపురాని సంగటన"
"అదేవిటి ఇప్పటి వరకు సముద్రం అలా కెరటం అని మరి సంబంధం లేనివన్ని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నావు?"
"హ్మ్.. నిజం చెప్పాలంటే ఆ సముద్రం లో కెరటాన్ని గురించిన విషయం మీకు బోధపడాలని ముందు సముద్రం తో మొదలుపెట్టాను"
"అద్గది మళ్ళి అదే తంతు .. ఇప్పటికైనా విషయానికి రా... "
"ఇది జరిగి సుమారు పదమూడేళ్ళు అవుతుంది... సుమారుగా ఓ పుష్కర కాలం అనుకుందాం "
"అబ్బో పుష్కర కాలమె... చాల ఉంది కత ... "
"అందులో కత ఎం లేదు.. నిజంగా జరిగినదే మీకు వివరిస్తున్నా.. అది మరి ఎలా మొదలు పెట్టాలో అర్ధం కావటం లేదు... "


"అబ్బ... నసిగి విసిగించక అసలేం జరిగిందో చెప్పు బాబు.. పుష్కర కాలం పైమాటే అంటావు, అలా అంటావు, ఉప్పెన అంటావు, కెరటం అంటావు.. ఈ సముద్రం గోల ఏంటి ఆ ముఖం లో ఆ కవలికలేమిటి... ఇలా అన్ని కలగలిపి కవిత ఏమైనా అల్లావా ఏం ..?"
"ఒక్కటేమిటి తను గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ కవిత అలా అలవోకగా రాసెస్తున్నను.."
"నిజమేనా..?, మరి అంతగా గుర్తుకొచ్చేది అమ్మాయే ఐతే మరి అమ్మాయి గురించి చెప్పకుండా ఈ డొంకతిరుగుడు ఏంటి? ఆ సముద్రం గోల ఏంటి.. ఇలా ఈ వర్షాకాలం లో ఇలా ఈ యారాడ బీచ్ లో ఇలా ఈ మీటింగ్ ఏందీ?"
"తను నాకు పదిహేనేళ్ళకే పరిచయమైంది, ముద్దుగా ఉంటది, కవలలు.."
"చంపాడు బాబో చంపాడు.., ఇందాకల ఒక అమ్మాయి అన్నాడు, ఇప్పుడు కవలలు అంటున్నాడు.. నమ్మ మంటావ, ఎలా కనిపిస్తున్నాం నీకు..? చెప్పేదాంట్లో ఏమైనా నిజం ఉందా ?"
"నూటికి నూరుపాళ్ళు నిజం ఉంది.. ఆ కవలల్లో ఒక్కరు నేను చెప్పబోయే అమ్మాయి..."
"సో మొత్తానికి ఇంత ట్విస్ట్ ఇచ్చి.. ఇప్పుడు ఓపెన్ అవుతావా..?, ఈ మాత్రం దానికి యారాడ బీచ్ లో ఈ మీటింగ్ అవసరమా.. ?"
"అవసరమె.. ఆ సముద్రాన్ని చూడండి.. ఎలా ఐతే ఆ అలా ఈ ఒడ్డును తాకి మళ్ళి వెనకగా మరలి వెళుతుందో నిశితగా గమనించారా ?"
"నువ్వు పిలిస్తే అది రాలేదు కదా... ఐన నువ్వేదో విషయం చెబుతానని చెబితే ఇక్కడకు వస్తే సముద్ర అలను పరికించాలా ..? మేమేమైనా నీ కంటికి మెరైన్ ఇంజనీర్స్ లా  కనిపిస్తున్నామా లేక పెట్రోలియం డ్రిల్లెర్స్  లా కనిపిస్తున్నమ.. ?"
"కాదు కాదు అందుక్కాదు, ఈ సముద్ర అలలకి ఆ పుష్కర సంగటన కి సంబంధం ఉంది"
"ఇద్దరు మొదట కలుసుకుంది ఇక్కడేనా, చెప్పవేం మరి "
"ఎహె అది కాదు.. ఆ కడలి తారంగం ఎలా ఐతే ఒడ్డు కు వచ్చి తిరిగి వెళ్ళిపోతుందో , అలానే ఈ అమ్మాయి విషయం లోను జరిగింది"
"హ్మ్.. హ్మ్ అలా రా దారికి, సో అందుకన్నమాట ఇంతా సోది చెప్పింది"
"అలా విసుక్కోవద్దు ప్లీజ్... అసలు కథ ఇంకా మొదలు కానే లేదు, ఇప్పుడే ఓ కొలిక్కి వస్తే ఎం బావుంటుంది..  అసలు ఏమైందంటే..."

Popular Posts