రాగాలాపన
రంగుల రాట్నం రివ్వున రువ్వింది
రెప్పలమాటున రేయి చాటున రేతిరి నిండింది
రాగాలాపన రంగుల హరివిల్లై విరిసింది
ఎన్ని "రా"లైన వత్సరాలైన
నీ రాకకై మేన రంగరించి తెచ్చానే
గలగల ఏటి గోల లో
గమ్మత్తుగా గజిబిజిగా
గాల్లో తేలి గులాబి రేకు గుబాలిస్తుందే
గాయం నా యదకు చేసి గాయబ్ ఐనావె
ఎన్ని "గా"లైన పిల్లగాలిలా నిన్ను వెంబడిస్తూ ఉంటానే
లేత లావణ్య సల్లలిత లలన
లాగి నా మనసుని లేలేతగా
లాలించి లఘుస్నేహం చేస్తివే
ఎన్ని "లా"లైన నీల ఎవ్వరిని లాలించలేదే
పారే ప్రతి పిల్లవాగులో
ప్రేమగా నిన్ను పిలిచానే
పలకరించక పెలవగా పలికావే
ఎన్ని "ప"లైన విన్నపాలైన
పూచే ప్రతి పువ్వుతో పంపానే
నన్ను నేనుగానే నిలవని
నింగి నేల నిప్పుల నావలో
నదిని నేడు అలవోకగా దాటని
ఎన్ని "న"లైన ఎన్ని నాళ్ళు ఐన
నాలోని నేను నీకోసం నేను
రెప్పలమాటున రేయి చాటున రేతిరి నిండింది
రాగాలాపన రంగుల హరివిల్లై విరిసింది
ఎన్ని "రా"లైన వత్సరాలైన
నీ రాకకై మేన రంగరించి తెచ్చానే
గలగల ఏటి గోల లో
గమ్మత్తుగా గజిబిజిగా
గాల్లో తేలి గులాబి రేకు గుబాలిస్తుందే
గాయం నా యదకు చేసి గాయబ్ ఐనావె
ఎన్ని "గా"లైన పిల్లగాలిలా నిన్ను వెంబడిస్తూ ఉంటానే
లేత లావణ్య సల్లలిత లలన
లాగి నా మనసుని లేలేతగా
లాలించి లఘుస్నేహం చేస్తివే
ఎన్ని "లా"లైన నీల ఎవ్వరిని లాలించలేదే
పారే ప్రతి పిల్లవాగులో
ప్రేమగా నిన్ను పిలిచానే
పలకరించక పెలవగా పలికావే
ఎన్ని "ప"లైన విన్నపాలైన
పూచే ప్రతి పువ్వుతో పంపానే
నింగి నేల నిప్పుల నావలో
నదిని నేడు అలవోకగా దాటని
ఎన్ని "న"లైన ఎన్ని నాళ్ళు ఐన
నాలోని నేను నీకోసం నేను