గుప్పెడంత కూడా లేని గుండె

గుప్పెడంత కూడా లేని గుండెలో ఇమిడి దాగున్న భావాల ప్రవాహం సంద్రం కన్నా లోతైనది
నిట్టూర్పులు నిస్సహాయత కోరే మనసు లోని ఆలోచనలు అలా నింగి కన్నా ఎత్తైనది
భారమే లేని అతి తేలికైన అక్షరాలే ఏర్చి కుర్చీ భావమై జనించే వేళా ఆ అక్షరానికి వెలకట్టలేనిది

గుండె ఐన ఏదో నాటికి ఆగిపోతుంది , ఎగసే అల అమావాస్యకో పున్నమికో పురోగమన తిరోగమనం అవుతుంది
మది లోని భావాలు కొన్ని సార్లు ఒకే ల ఉండవు, కవితపు అక్షరాలూ మాత్రం చూసే వారి మదిలో శిలక్షరాలై ఎన్నటికి నిలిచిపోతుంది

జీవితం అనే కుంచె నుండి జాలువారే ప్రతి ఘట్టం ఓ రంగు అనుకుంటే , ఆ రంగుల కలయిక తో ఓ జీవన చిత్రం ప్రాణం పోసుకుంటూ ఎదురు పడుతుంది
అక్షరాలూ చిన్నవే ఐన కవిత చిన్నదే ఐన భావం ఎంతో పెద్దది కలకాలం నిలిచి ఉంటది. 

Popular Posts