నీకై నిరీక్షణ
నే వేసిన ప్రతి అడుగు నీ వైపే కాని నీ జాడ ఎటు లేదు
ఎంత దూరం వచ్చానో గురుతే లేదు
ఓ సారి వెనక్కి తిరిగి చూద్దామన్న ధ్యాసే లేదు
ఎంత దూరం లో ఉన్నవో ఊసే లేదు
ఓ సారిలా కాలాన్ని ఇలా శీలల ఉండిపోని
నే కన్నా కలలన్ని నాకు ఎదురవ్వని
నా ఆలోచన రూపురేఖలు నువ్వే అవ్వని
తిరిగి నిన్ను నేను నాలోనే చూసుకొని
జోరు వర్షం వచ్చిన తడుస్తూనే ఉన్నాను
మండే ఎండలోన నీకై వేచి ఉన్నాను
రాతిరి జాబిలితో వెన్నెల కబురంపినాను
తిరుగు టపా పంపుతావని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను
నీ జ్ఞాపకం నా మది నిండా సాలెగుడు లా చుట్టుముట్టని
నీ వాలు కనులలో ఓ చిరు స్వప్నమై నన్నుండిపోనీ
నీ మాటల ప్రవాహం లో ఓ కన్నీటి బొట్టు నేనవని
నీ యద లయలో నేను ఓ గుండె చప్పుడవ్వని

Image Courtesy: Corey Rich (Picasa) |