ప్రకృతి అందాలు
Image Courtesy: Ralf Missal (Picasa) |
మంచు తూఫాను వడగళ్ళు మంచుకొండలు హిమశంఖాలు శృంఖలాలు
వర్షపు ఈదురు గాలులు చివురించే ఆకులపై ముత్యపు చినుకు ప్రతిబింబాలు దట్టమైన పొదలు విశాల వృక్షాలు , రంగురంగుల పువ్వులు ,
పారే పిల్ల వాగులు ఏరులు సెలయేళ్ళు నదులు జలపాతాలు
నిప్పు కణికెలు కుంపటి సెలయేళ్ళు దట్టమైన పొగలు రాళ్ళూ రప్పలు
ప్రకృతి కుంచె నుండి జాలువారిన రంగు రంగుల హరివిల్లు
ఇంతటి వైవిధ్యం ఉన్న కలసికట్టుగానే మెలిగే ప్రకృతి సోయగాలు
కాని మనిషికి మనిషికి మనసుకు మనసుకు ఎందుకీ ఆర్భాటాలు
అన్నిటిని ఎరిగిన ఒకరిని ఒకరు అర్ధం చేసుకోలేని వ్యత్యాసాలు
కలసి కట్టుగానే ఉండాలని ప్రకృతి పాఠం నేర్పిన నేర్వని వైనాలు