కావ్యం అంటే
అక్షలారను భావం అనే కొలను లో దింపి మనసనే చేద తో వెలుపలికి లాగితే అదే కావ్యం అంటే
మనసులోని అనంతమైన భావాలను ఎకరూపు పెట్టి ఒక మాల లా కడితే అదే కావ్యం అంటే
కన్నులే చూసే లోకాన్ని అక్షరాలతో మనసుకు కూడా చూపగలిగితే అదే కావ్యం అంటే
ముసిరే భావాలు మెదిలే ఆలోచనల సరళి మానవత్వపు విలువలు కలగలిపితే అదే కావ్యం అంటే
నా భావాన్ని ఇతలులతో పంచుకుంటే భాష బేధాలు ఏవి నన్ను ఆపలేవు
నాలోని ఆలోచనల సౌరభమ్ ఈ అక్షర కూర్పు నవయుగపు సంచలనం
భాషలు ఎన్ని ఉన్న అన్నిట్లో చెప్పే భావం ఒక్కటే దాన్ని లోకం లో ఏ శక్తి అడ్డుకోలేదు
అది చెప్పడానికే మానస పుత్రికగా ఓ వెన్నెల కొమ్మల వెలుగుచూసింది నా కావ్యం
నోట్: ఈ క్రింది లైన్ ను నా సొంత భాష లో వ్రాస్తున్నాను:
అది చెప్పడానికే మానస పుత్రికగా ఓ వెన్నెల కొమ్మల వెలుగుచూసింది నా కావ్యం
ఊ కెనజ్ మాతెమాతి హుయి చాందేర్ ధ్వాళోసప్ డ్వాళీని వజాళో దిటిచ మారో కవిత
ఏ భాషైన భావం ఒక్కటే అని చెప్పడానికే ఇక్కడ నా మాతృభాష ప్రస్తావించడం జరిగింది.
తీక్షణంగా గమనించాలని కావాలనే మొదటి పదం తచ్చు-అప్పు గా రాయడం జరిగింది.