అందనంత దూరం

 నువ్వు పరిచయమయ్యావు నా లోకమే మారింది
నిన్ను తలచుకున్న ప్రతిసారి ఏదో తెలియని ఆనందం కలిగింది 
ప్రేమో ఆకర్షణో తెలియని వయసు ఐన నా మనసుని కొల్లగొట్టింది 
ఇన్నేళ్ళు ఐన నిన్ను మరవలేదంటే అది ఆకర్షణ ఎంత మాత్రం కాదంటుంది నా మనసు 

ఏమో మరి నువ్వు ఉన్నప్పుడు నాకు ఎలాటి వెలితి కనపడలేదు 
ఇప్పుడేమో నా ప్రతి పదం ముందు ఒక సారి వెనక ఒకసారి నిన్ను తలవక మానసోప్పదు
ఇన్నేళ్ళ మన పరిచయం అన్ని రంగులు చూసింది 
మన పరిచయాన్ని నేను ఉద రంగు తో పోలిస్తే 

అది పండి గోరింటాకు నారింజల  మెరిసింది 
తామర రేకులా నాజుకైనా నా ప్రేమ కలగలిపి ఎర్రగా పండింది 
అంతలోనే అమావాస్య చీకటి అలుముకుంది 
నా అందాల జాబిలీ నిన్ను నా నుండి దూరం చేసింది

నువ్వేమో అక్కడ నేనేమో ఇక్కడ అందుకున్నంత దూరం లోనే అందనంత దూరం

Popular Posts