Posts

కావ్యాంజలి

Image
ప్రతీకాత్మక చిత్రం  కనుచూపులకే అందని రూపమా కలవై నా కన్నుల్లో నిలువుమా  కాంతివై సంక్రాంతి వై నీలాల  కన్నుల్లో దాగిన నిండు కాంతికి రూపమై  వెన్నెల కాచిన అడివికి ఋతురాగానివై  కల్మషం లేని మనసు కె ప్రతిబింబం నీవై  కాలం తో పాటు కాలాతీతమై కన్నుల్లో మెదిలే స్వప్నరాగమై భావ గీతమై  సాగర ఘోషల లయలో తరంగాల నీడలో కడలి అలల్లో నిక్షిప్తమై  మేలిమి ముత్యాల కాంతి పంచుతూ ఇలా సాగిపో కావ్యాంజలి వై నిత్య నూతన వాహిని వై 

కన్నీరు-పన్నీరు

Image
Indicative Image Only ఆర్ద్రత నిండిన కన్నుల్లో చెప్పలేని భావాలు ఎన్నో ఎన్నెన్నో గుండె బరువెక్కినా మనసుకు హాయి కలిగినా పలకరించే నేస్తాలు యదలో బాధ ఉప్పోంగిన చిద్విలాసముగా మనసు మురిసినా ఆకాశాన చినుకుల్లా కంటి భాషకు సరితూ గే అక్షాశృవులు మనసుకు బాధకలిగినా గుండెలయ తప్పిన రాలే భావానికి ఆనవాలు ఈ చమర్చే కనులు. సంతోషమైనా దుఃఖమైన జాలువారే నయనభాష్పాలు ఉద్వేగ సంకేతాలు చెమ్మగిల్లిన కనులను తుడిచి సాంత్వన చేకూర్చే చేతులు ఉన్నంతవరకు ఆ కన్నిళ్ళు మనసు బాధను మనసు భాషను అర్థం చేసుకునే ఆర్ద్రత నిండిన హృదయంతరాలు చెమర్చిన కన్నుల వెనక దాగిన భావం లోకం లో అన్ని చెడులను జయిస్తుంది కన్నులు పలికే భావన ను యదకు హత్తుకుని సాంత్వనలతో ఓలలాడిస్తుంది ఎవరిని ఉద్దెశించి రాసినది కాదని మనవి. శ్రీధర్ భూక్య  

నవ్వు నువ్వు

Image
ఓయ్ ఏది నవ్వు నువ్వు  నవ్వు నవ్వితే రాలేవి చిరాకులే  ​చిరాకు ఉంటె పరాకులే  పరాకుగా ఉంటె ఏవో ఆలోచనలే  ఆలోచనలన్నీ మదిలో రేగే ఊహలే  ఊహల్లో తేలీ మనసుకు కలిగే కలవరింతలే  కలవరింతల్లో కలిగేనేవో పలవరింతలే  పలవరింతల్లో దాగెను హాయిరాగాలే  హాయిరాగాల్లో వికసించెను నవ్వులే  ఓయ్ ఏది నవ్వు నువ్వు నవ్వు

జీవితానికి విలువ

Image
Indicative Image Only వెలుగు లేనిదే నీడ ఉండదు వెలుగు తోనే నీడ విలువ ఎండ లేనిదే చినుకుండదు ఎండా తోనే  వర్షానికి విలువ బాధ లేనిదే సంతోషం ఉండదు బాధ తోనే సంతోషానికి విలువ స్నేహం లేనిదే బంధం ఉండదు స్నేహం తోనే బంధానికి విలువ జీవితంలో  ఒడిదుడుకులు ఎప్పుడు ఉండేవే అని తెలిసిన నాడు జీవితం అంటే అన్ని భావాల సమ్మేళనం అని తెలిసిన నాడు ఉవ్వెత్తున ఎగిసే అలలా నిలువెత్తున వెలిగే దీపంలా జ్ఞాన జ్యోతి లా ప్రజ్వలిస్తుంది మరొకరికి సాయపడుతూ సాగిపో ఇలా వెలుగు పంచితే దారి అదే కనిపిస్తుంది తిమిరంధకారం కన్నా తేటతెల్లని వెలుగు ఎలా అయితే మనసుకు సాంత్వన కలిగిస్తుందో నిరాశ నిస్పృహల నిట్టుర్పుల జీవితానికి ఇదే సరి అయిన విరుగుడని తెలుసుకో ఈ జీవిత పయనం లో వడివడిగా అడుగులేస్తూ  నవ్వుతు నవ్విస్తూ సాగు లోకం నిన్ను చూసి గర్వ పడి కోరుకోవాలి అందరితో పాటు నీయొక్క  బాగు 

జీవితం ఓ అలుపెరుగని వయనం

Image
​ Image Courtesy: Deviant Art జీవితం ఓ అలుపెరుగని వయనం నవ్వులు ఇందులోనే బాధలు ఇందులోనే పయనం మాత్రం ఆపకు ఓ బాటసారి గమ్యం ముఖ్యం కాదు గమనమే ముఖ్యం నువ్వు నడక నేర్చుకున్నది ఈ జీవితం తోనే ప్రేమను మమతను చవి చూసింది ఈ దేహం తోనే ప్రకృతి నీకు తోడై నీడై నీ వెంట రాగా ఆశిస్సులే నీకు ఆలంబనై నిలువగా సాగర కెరటం లో ఏమున్నది ఓ నీటీ బొట్ల సమూహమే ఉదయకాంతిలో ఏమున్నది సూర్యుని కోట్ల కాంతి పుంజలే మబ్బుల్లో ఏమున్నది దుమ్ము ధూళి తాలుకు ఆనవాలే అవే అంతటి శక్తిని పంచుతున్నాయంటే మనం కూడ కలసికట్టుగా ఒక జట్టుగా ఉంటే కలిమి బలిమి లేకుంటే ప్రపంచమే భగ్గున మండే నిప్పుల కొలిమి Image Courtesy: Deviant Art

కురిసే మేఘం

Image
Image Courtesy: Flickr చిరు చినుకుల  సాయంత్రం  దోసిలిలో ఒక్కో ముత్యాన్ని పడుతూ  నిలువునా తడుస్తూ ఆ తుప్పరలో నన్ను నేనే మరిచిపోతూ  పరిగెత్తుకుని వెళ్లి నీటిమీద పడవలు చేసి పారించాను  నీలి మేఘాల సవ్వడిలో  మెరుపుతీగలా హొయలుబొతు  ఆ చిరు చినుకుల వరదలే అనుపమానంగా  ఎగసే అలలై ముచ్చాతగోలిపాయి నా నందనవనాన్నే చక్కగా అలంకరించాయి  చల్లని గాలి చెవులలో చేరి శంఖము పూరించినా  ఆ తెలియని హాయేదో నా లోలోపలా కదలాడింది  నీలి నయనాలలో ఏదో తెలియని వెఱ్రితనం నన్ను ఓ చోట నిలవనీకా  గాలిలా చినుకుల్లో తడపసాగింది నిండు కుండలో గోదారిని పట్టి నెత్తిన బోర్లించినట్టు  

పెళ్ళి

Image
Indicative Image Only ఒకె లగ్నం లో ఇరు మనసులని మూడు ముళ్ళ బంధంతో నాలుగు వేదాల మంత్రోపచారణతో పంచ భూతాల సాక్షిగా ఆరు ఋతువుల్లో కలిసిమెలసి ఉండాలని సప్తపదులు వెంట నడయాడగ అష్టైశ్వర్యాలు సిద్ధించాలని నవరసాలు తమ సంసారం లో నిండాలని పది కాలాల పాటు కష్ట సుఖాలు పంచుకునె బంధమే పెళ్ళి