కన్నీరు-పన్నీరు
Indicative Image Only |
ఆర్ద్రత నిండిన కన్నుల్లో చెప్పలేని భావాలు ఎన్నో ఎన్నెన్నో
గుండె బరువెక్కినా మనసుకు హాయి కలిగినా పలకరించే నేస్తాలు
యదలో బాధ ఉప్పోంగిన చిద్విలాసముగా మనసు మురిసినా
ఆకాశాన చినుకుల్లా కంటి భాషకు సరితూ గే అక్షాశృవులు
మనసుకు బాధకలిగినా గుండెలయ తప్పిన రాలే భావానికి ఆనవాలు ఈ చమర్చే కనులు. సంతోషమైనా దుఃఖమైన జాలువారే నయనభాష్పాలు ఉద్వేగ సంకేతాలు
చెమ్మగిల్లిన కనులను తుడిచి సాంత్వన చేకూర్చే చేతులు ఉన్నంతవరకు ఆ కన్నిళ్ళు
మనసు బాధను మనసు భాషను అర్థం చేసుకునే ఆర్ద్రత నిండిన హృదయంతరాలు
చెమర్చిన కన్నుల వెనక దాగిన భావం లోకం లో అన్ని చెడులను జయిస్తుంది
కన్నులు పలికే భావన ను యదకు హత్తుకుని సాంత్వనలతో ఓలలాడిస్తుంది
ఎవరిని ఉద్దెశించి రాసినది కాదని మనవి.
శ్రీధర్ భూక్య